వదినను అడగాలంటే సిగ్గేసింది అందుకే చరణ్ దగ్గర అప్పు తీసుకున్నా... పవన్ నిస్సహాయత నిజమేనా?

Published : Sep 16, 2022, 05:13 PM ISTUpdated : Sep 16, 2022, 05:14 PM IST

ఓ పదిహేనేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి. చేతిలో ఐదు పదీ కూడా లేక ఎవరిని అడగాలో తెలియక రామ్ చరణ్ దగ్గర అప్పు చేశానని ఆయన చెప్పడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. 

PREV
16
వదినను అడగాలంటే సిగ్గేసింది అందుకే చరణ్ దగ్గర అప్పు తీసుకున్నా... పవన్ నిస్సహాయత నిజమేనా?

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పాల్గొన్న ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ దర్శకుడిగా 2007లో చిరుత చిత్రంతో రామ్ చరణ్ హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పవన్, చరణ్, చిరంజీవిలను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు.

26

ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. అప్పట్లో నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. వదినను అడుగుదామా అంటే హీరో అయ్యాడు, సినిమాలు చేస్తున్నాడు ఇంకా నన్ను డబ్బులు అడుగుతాడేంటి అనుకుంటుందేమో అని సిగ్గేసేది. చేతిలో ఐదు పది కూడా లేని పరిస్థితుల్లో ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఆ టైం లో చరణ్ దగ్గర అప్పు తీసుకునేవాడిని. ఖర్చు పెట్టడం తెలియని చరణ్ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండేవి. 
 

36


 సినిమాలు చేస్తాను డబ్బులు వస్తాయి. నీకు వడ్డీతో సహా చెల్లించేస్తానని చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. చరణ్ కి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇంకా ఇవ్వలేదు. తన దగ్గర అప్పు చేయడానికి నేను ఫీల్ కాను... అంటూ ఆ ఇంటర్వ్యూలో పవన్ చెప్పారు. పాకెట్ మనీ బాబాయ్ కి ఇచ్చేసేవాడిని. ఆయనైతే వడ్డీ ఇస్తాడని ఖర్చు పెట్టకుండా దాచేవాడిని అని రామ్ చరణ్ పవన్ మాటలను విస్తరిస్తూ చెప్పాడు. 
 

46


ఇంతకీ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ చేసిన అప్పు ఎంతంటే వంద లేదా రెండొందలు. ఇలా అనేక సార్లు చరణ్ దగ్గర తీసుకున్నాడట. కోట్లు సంపాదించే ఓ స్టార్ హీరో తమ్ముడు, స్వతహాగా ఓ హీరో అయినా పవన్ పిల్లాడు చరణ్ దగ్గర అంత తక్కువ మొత్తం అప్పు చేశాడంటే నమ్మొచ్చా. అందులోనూ పవనేమీ ప్లాప్ హీరో కాదు. ఫస్ట్ సినిమా నుండే ఆయనకంటూ మార్కెట్ ఏర్పడింది. 
 

56


డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, రెండో చిత్రం గోకులంలో సీత యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే మూడో చిత్రం సుస్వాగతం సూపర్ హిట్. ఇక తొలిప్రేమ బ్లాక్ బస్టర్ హిట్. 1998 నాటికే పవన్ రెమ్యూనరేషన్ లక్షల్లోకి చేరింది. 2001లో విడుదలైన ఖుషి మూవీ వరకు తన వద్ద డబ్బులు ఉండేవి కావని, వందా రెండొందలు అబ్బాయి చరణ్ దగ్గర అప్పు చేశానంటే నమ్మొచ్చా... 
 

66


పవన్ కామెంట్స్ లో ఖచ్చితంగా లాజిక్ మిస్ అవుతుంది. తొలిప్రేమ తర్వాత పవన్ చేసిన తమ్ముడు, బద్రి కూడా సూపర్ హిట్స్. కాబట్టి పవన్ చెప్పిన అప్పు సిద్ధాంతంలో నిజం లేదని తేలిపోయింది. ఆ ఇంటర్వ్యూలో పవన్ ఈ మాటలు చెప్పేటప్పుడు  పక్కనే ఉన్న చిరంజీవి తల వంచుకొని ముసిముసిగా నవ్వారు. పవన్ తన ఎడ్యుకేషన్ గురించి కూడా పలు వేదికపై పలు రకాల మాటలు చెప్పి విమర్శల పాలయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories