తారక్ కు చెయ్యి తెగింది, నొప్పితో విలవిల్లాడిపోయాడు, భయపడిపోయాం

First Published Oct 7, 2024, 3:35 PM IST

చేతిలో ఒక సన్నటి నరం ఉంటుంది. చాలా సున్నితం. ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది’ అని అన్నాడు. ఆ తర్వాత వైజాగ్‌ తీసుకెళ్లాం.

Ntr, V.V Vinayak, Aadi


షూటింగ్ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూంటాయి. అయితే ఆ క్షణం చాలా భయంగా అనిపిస్తుంది. తర్వాత వాటిని తలుచుకుంటే కొద్దిగా భయం, తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకున్నామే అనే చిన్నపాటి ఆనందం కలుగుతుంది. మరీ ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి జరిగే ప్రమాదాలకు ఎవరూ ఏం చెయ్యలేరు.

అయితే అలా ప్రమాదం జరిగితే ఆ ఇంపాక్ట్ షూటింగ్ పై  పడుతుంది. దాంతో దర్శకుడుకి, నిర్మాతలు ఖచ్చితంగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి ఓ సంఘటన దర్శకుడు వివి వినాయిక్ జీవితంలో జరిగింది. అదీ ఆది సినిమా షూటింగ్ లో . అప్పటి విశేషాలు చూద్దాం.

Ntr, V.V Vinayak, Aadi


తెలుగు చిత్ర ప రిశ్రమలోని  క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్‌ (VV Vinayak)- నటుడు ఎన్టీఆర్‌ (NTR) కాంబో ఒకటి. తొలి ప్రయత్నం ‘ఆది’తోనే (aadi) ఈ ఇద్దరు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. 2002లో విడుదలైన ఈ సినిమా మాస్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. మరి, వినాయక్‌.. ఎన్టీఆర్‌తో ఈ యాక్షన్‌ కథకు బదులు లవ్‌స్టోరీని తీసుంటే ఎలా ఉండేది?  అనే  ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. 

Latest Videos


Ntr, V.V Vinayak, Aadi


ఎందుకంటే ‘శ్రీ’ అనే ప్రేమ కథతో వినాయక్‌ దర్శకుడిగా పరిచయమవుదామనుకున్నారు. సుమారు రూ.40 లక్షల బడ్జెట్‌లో  హీరోయిన్ ఓరియెంటెడ్ కథని రాసుకున్నారు. అందులో ఇద్దరు కొత్త నటులకు అవకాశం ఉంది. నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్‌ను కలిశారు వినాయక్‌. ఏదో విందాం లే అన్నట్టుగా ‘నాకు ఎక్కువ టైమ్ లేదు.. త్వరగా కథ చెప్పు’ అని ఎన్టీఆర్‌ అంటే  వినాయక్‌ 5 నిమిషాల్లో ఇంట్రడక్షన్‌ సీన్‌ చెప్పారు. కట్ చేస్తే.. ఆ సీన్‌ తారక్‌కు బాగా నచ్చడంతో 2 గంటలపాటు పూర్తి కథ విన్నారట.

Ntr, V.V Vinayak, Aadi


‘‘అంతా హ్యాపీ అనుకునేలోపు ఓ క్యారెక్టర్‌ ఎంటరైంది. ఆ క్యారెక్టర్‌ పేరు కొడాలి నాని. ‘మనకి లవ్‌స్టోరీలు వద్దని చెప్పు. ఇప్పుడు ఆ డైరెక్టర్‌తో మనకెందుకు?’ అని ఆయన ఎన్టీఆర్‌తో అన్నారు’’ అని వినాయిక్ గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ తర్వాతా మేం చాలా సార్లు కలిశాం. అయితే, ఈ విషయం నాతో చెప్పలేక తారక్‌ ఇబ్బంది పడేవాడు. నాకు మరో అవకాశం ఇవ్వు. ఇంకో కథ చెప్తా, నచ్చితే చేద్దాం అని అన్నా. ఆయన ఓకే అనగానే ‘ఆది’ కథ వినిపించా. అంతే ఆయనకు బాగా నచ్చేసింది’’ అని వినాయక్‌ తెలిపారు. 

NTR, SS Rajamouli, Devara


ఇంకో విశేషం ఏంటంటే.. ‘శ్రీ’ స్క్రిప్టు రాసేందుకు ఎన్నో ఏళ్లు పట్టగా ‘ఆది’ని రెండు రోజుల్లోనే రాశారట. అలా సంచలనంగా మారిన వినాయక్‌- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ‘సాంబ’, ‘అదుర్స్‌’ చిత్రాలు రూపొందాయి. రీసెంట్ గా  వినాయక్‌  ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బిజీగా చేసారు. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కింది. అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యింది.

NTR, SS Rajamouli, Devara


ఇక ఆది నాటి విశేషాలు గుర్తు చేసుకుంటూ వినాయిక్ ...అప్పుడు తారక్ కు చెయ్య తెగిన విషయం చెప్పుకొచ్చారు.  వినాయిక్ మాట్లాడుతూ..షూటింగ్ లో ఉండగా తారక్ చెయ్యి తెగింది. చాలా భయపడిపోయాం. రక్తం కారిపోతోంది. నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్‌ మమ్మల్ని భయపెట్టాడు. ‘నా వల్ల కాదు. వైజాగ్‌ తీసుకెళ్లండి. చేతిలో ఒక సన్నటి నరం ఉంటుంది. చాలా సున్నితం. ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది’ అని అన్నాడు. ఆ తర్వాత వైజాగ్‌ తీసుకెళ్లాం అని చెప్పుకొచ్చారు. 


ఓ టైమ్ లో దర్శకుడు వివి వినాయక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఉన్న ప్రతీ హీరో ఆయనతో చేయాలని కోరుకునేవారు.  ఆయన స్టార్స్ కు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఎందుకంటే ఆయన  తెలుగు ఇండస్ట్రీలో మాస్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడీయన. ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెం 150.. ఇలా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి  వినాయక్ కెరీర్ లో. ఆయన సరైన స్క్రిప్టుతో వస్తే మళ్లీ సినిమా చేయటానికి రెడీ అంటారు చిరంజీవి.
 

click me!