విరాట్‌ కోహ్లీది పరమ చెత్త ప్రవర్తన.. విరుచుకుపడ్డ బాలీవుడ్ స్టార్‌

First Published Aug 15, 2020, 4:01 PM IST

ఇండియన్‌ క్రికెట్ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలిసిందే. అయితే అంతటి టాప్ క్రికెటర్‌పై ఓ బాలీవుడ్ సీనియర్‌ నటుడు దారుణమైన కామెంట్స్‌ చేశాడు. ఓ సోషల్‌ మీడియా డిబెట్‌లో భాగంగా నసీరుద్దీన్‌ షా, విరాట్‌పై విరుచుకుపడ్డాడు.

2018లో జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా కెప్టెన్‌తో వాదనకు దిగాడు. అయితే దీని వల్ల విరాట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
undefined
అయితే ఆ సమయంలో జరిగిన ఓ ఫేస్‌బుక్‌ డిబెట్‌తో బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్‌ షా, విరాట్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. విరాట్‌ ప్రపంచంలోనే చెత్తగా ప్రవర్తించాడు అంటూ కామెంట్‌ చేశాడు నసీర్‌. `విరాట్ కేవలం ప్రపంచంలోని బెస్ట్‌ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు.. గ్రౌండ్‌లో అత్యంత చెత్తగా ప్రవర్తించిన ఆటగాడు కూడా. ఆయన కోపం, చెడ్డ ప్రవర్తన వల్ల అతని క్రికెట్ టాలెంట్‌ కూడా మసకబారుతోంది` అంటూ తన అఫీషియల్ ఫేస్‌బుక్‌ పేజ్‌లో కామెంట్ చేశాడు నసీర్.‌
undefined
ఓ అభిమాని ఫేస్‌బుక్‌లో తాను ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌ కంటే, ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువ ఇష్టపడతానని కామెంట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై దేశం విడిచిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు విరాట్‌.
undefined
ఈ కామెంట్‌ను కూడా ఉద్దేశీస్తూ నసీరుద్దీన్‌ షా విరాట్‌ను విమర్శించాడు. అయితే విరాట్‌పై షా కామెంట్‌లపై విరాట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు షా కరెక్ట్‌ అంటూ మద్దతు తెలిపారు.
undefined
అయితే కోహ్లీ ఆస్ట్రేలియా కెప్టెన్‌పై దురుసుగా ప్రవర్తించిన సంఘటన పై స్పందిస్తూ ఓ అభిమాని, `ఆస్ట్రేలియాపై ఆ మాత్రం దూకుడు చూపించకపోతే నెగ్గడం కష్టం. విరాట్‌ సరిగ్గానే ప్రవర్తించాడు` అంటూ సమర్థించే ప్రయత్నం చేశాడు. అయితే మరో అభిమాని `విరాట్‌ మంచి ఆటగాడు అనిపించుకోవాలి అంటే మైదానంలో అతని ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. కేవలం మంచిగా ఆడినంత మాత్రాన మంచి ఆటగాడు కాలేడు` అంటూ కామెంట్ చేశాడు.
undefined
అయితే తన కామెంట్స్‌కు మద్దతు తెలిపిన వారికి నసీరుద్దీన్‌ షా కృతజ్ఞతలు తెలిపాడు. `అతని ప్రవర్తన, బ్యాటింగ్ టాలెంట్‌కు కీర్తి దక్కకుండా చేస్తుంది. తమ ప్రవర్తన మంచిగా ఉన్న కారణంగానే బ్రాడ్‌ మాన్‌, లారా, సచిన్‌ టెండూల్కర్‌ లెజెండ్స్‌ అయ్యారు` అంటూ కామెంట్ చేశాడు నసీరుద్దీన్ షా.
undefined
click me!