విశ్వం ట్విట్టర్ రివ్యూ: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్, గోపీచంద్ ఫైట్స్ కేక, ఓవరాల్ రిజల్ట్ ఇదే!

First Published | Oct 11, 2024, 7:52 AM IST

గోపీచంద్-శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన చిత్రం విశ్వం. వరల్డ్ వైడ్ అక్టోబర్ 11న విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ టాక్ ఏమిటో చూద్దాం 
 

Viswam movie Review

మాస్ హీరోగా కమర్షియల్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ రేసులో వెనుకబడ్డారు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోయింది. ఈ క్రమంలో గోపీచంద్ అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితం మాత్రం దక్కడం లేదు. 
 

Viswam movie Review

అదే సమయంలో దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి కూడా అలానే ఉంది. స్టార్ హీరోల ఫేవరెట్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్స్ కొట్టిన శ్రీను వైట్ల... పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దూకుడు, బాద్ షా చిత్రాల అనంతరం శ్రీను వైట్ల సక్సెస్ ముఖం చూడలేదు. మహేష్ తో ఆయన చేసిన రెండో చిత్రం ఆగడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

శ్రీను వైట్ల టీమ్ విచ్ఛిన్నం కావడం కూడా ఆయనకు మైనస్ అయ్యింది. బెస్ట్ డైలాగ్ రైటర్స్ గా ఉన్న గోపి మోహన్, కోనా వెంకట్... విభేదాలతో శ్రీను వైట్లకు దూరమయ్యారు. కాగా గోపి మోహన్ మరలా శ్రీను వైట్లతో కలిశారు. విశ్వం మూవీకి పని చేశారు. 


Viswam movie Review

కసితో విశ్వం చిత్రానికి గోపీచంద్-శ్రీను వైట్ల పని చేశారు. హిట్ కొట్టి... ఇద్దరు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నారు. విశ్వం చిత్రంలో గోపి చంద్ కి జంటగా కావ్య థాపర్ నటించింది. జిష్షు సేన్ గుప్త విలన్ రోల్ చేశారు. సునీల్, వెన్నెల కిషోర్, నరేష్, రాహుల్ రామకృష్ణ వంటి నటులు ఇతర కీలక రోల్స్ చేశారు. వేణు దోనెపూడి, టి జీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నా నిర్మించారు. విశ్వం చిత్రానికి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. 


సోషల్ మీడియాలో విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. శ్రీను వైట్ల మార్క్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయని అంటున్నారు. విజువల్స్ ఆకట్టుకుంటాయి. గోపి చంద్ గత చిత్రాలతో పోల్చితే విశ్వం బాగుందని అంటున్నారు. 
 

Viswam movie Review

శ్రీను వైట్ల సినిమాలకు కామెడీనే ప్రధాన బలం చాలా వరకు ఆ విషయంలో దర్శకుడు శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ సూపర్ హిట్. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్ ఎవర్ గ్రీన్. ఆ తరహా కామెడీ ట్రాక్ విశ్వం చిత్రానికి శ్రీను వైట్ల ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు ఆశించే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అంశాలు సినిమాలో ఉన్నాయట. 

యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. హీరో గోపీచంద్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంటున్నారు. ఆయన కామెడీ యాంగిల్ సైతం ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పర్లేదు. కావ్య థాపర్ నటనకు యావరేజ్ మార్క్స్ పడుతున్నాయి. మ్యూజిక్ ఓకే. పూర్తి స్థాయిలో మెప్పించదట. 

Viswam movie Review

అదే సమయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. కథలో పెద్దగా కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే సైతం తేలిపోయింది. శ్రీను వైట్ల మరికొంత బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుండేదని ప్రేక్షకుల అభిప్రాయం. 

అయితే ఈ వీకెండ్ కి చూడదగ్గ సినిమానే. గోపి చంద్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ అలరిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్, గోపీచంద్ నటన, హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ మెప్పించే అంశాలని అంటున్నారు. 

Viswam movie Review

విశ్వం మూవీ ఫలితం ఏమిటనేది పూర్తి రివ్యూ వస్తే కానీ తెలియదు. ఇక వారాంతం గడిస్తే విశ్వం హిట్టా ఫట్టా అనేది స్పష్టం అవుతుంది. విశ్వం చిత్రానికి అటు దేవర నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. మిక్స్డ్  టాక్ తో కూడా దేవర థియేటర్స్ లో స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. రజినీకాంత్ వేట్టయన్ కి నెగిటివ్ టాక్ రావడం విశ్వం కి కలిసొచ్చే అంశం.. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!