దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రాజమౌళి, మహేష్ తొలి కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఫ్యాన్స్ ఊహించుకొనేదానికి పదింతలు ఉండేలా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుంది. జనవరి నుంచి ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.