బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. 14 మంది సెలెబ్స్ హౌస్లోకి కంటెస్టెంట్స్ గా ప్రవేశించారు. ఈసారి పెద్దగా పేరున్న నటులు లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్... ఇలా ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ బ్యాచ్ ని ఎక్కువగా హౌస్లోకి తోశారు.
నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్... వీరంతా స్టార్ మా సీరియల్ నటులు. అందులోనూ కన్నడ బ్యాచ్. తెలుగు బిగ్ బాస్ షోలో ఇతర బాషల వారు ఎక్కువగా కంటెస్ట్ చేశారు. సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 లేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కారణం.