చిరుపై డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్, చురకలు ? కాస్త ఘాటుగానే

ఆచార్య భారీ ప్లాఫ్ కు కారణం  డైరెక్టర్ కొరటాల శివ అని చిరు చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొరటాల శివ వంతు వచ్చింది. 
 

 ొకెరీర్ ప్రారంభం నుంచి దర్శకుడు  కొరటాల రాసుకునే కథలు .. వాటి ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయి.అక్కడే ఆయన మార్క్ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది.

 హీరోయిజాన్ని కొత్తగా చూపించే కొరటాల పవర్ఫుల్ డైలాగ్స్ ను కూడా హీరోతో చాలా సింపుల్ గా  చెప్పిస్తుంటాడు. అన్ని రకాల ఆడియన్స్ ను  మెప్పిచడంకోసం ఏక్కడ ఏం చేయాలో తెలిసిన దర్శకుడు కోరటాల.

ఓటమి ఎరుగని టాలీవుడ్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలు ప్లాప్ అవ్వలేదు. అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ స్థానం ప్రత్యేకం. ఆయన టేకింగ్ కాని, స్క్రీన్ ప్లే కాని డిఫరెంట్ గా  ఉటుంది. కానీ ఆచార్య చిత్రం దాాన్ని బ్రేక్ చేసింది.


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతే స్దాయిలో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సినిమాను నిర్మించింది స్వయానా రామ్ చరణ్. దీంతో మెగా ఫ్యామిలీ భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చింది.

 


ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్ కు వెళ్ళిన తిట్టుకుంటూ బయటికి వచ్చారు. చిరు కెరీర్ లోనే ఆచార్య భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇదంతా డైరెక్టర్ కొరటాల శివ వలనే జరిగిందని చిరు చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని చెప్తూ  వచ్చారు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?


ఆ మధ్యన  లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో డైరెక్టర్స్.. సెట్ లోనే డైలాగ్స్ రాస్తున్నారని, అది మంచి పద్దతి కాదని, దానివలన నటుల ఫోకస్ పోతుందని చిరంజీవి చెప్పుకొచ్చాడు. అలాగే  ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ డైరెక్టర్స్ ద్రుష్టి కథ మీద పెట్టాలి.. హీరోల డేట్స్ లేవు, దొరకడం లేదు అని త్వరత్వరగా తీసేస్తే సినిమా ఆ రిజల్ట్ హీరోల మీద పడుతుందని చెప్పుకొచ్చారు.

 ప్రేక్షకులకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలని, రెండో రోజే సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోతుందని, అలాంటి బాధితుల్లో తాను కూడా ఒకరని చెప్పుకొచ్చాడు.

చిరు చెప్పింది ఖచ్చితంగా శివ కొరటాల గురించే అని అర్దమైంది. చిరు ఆచార్య ప్లాప్ ను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఇంకా కొరటాలపై కోపం చూపిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 


‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రమోషన్స్ టైంలో ‘డైరెక్టర్ అంటే బాబీలా  (K. S. Ravindra) ఉండాలి, ఇతను ఎక్కువ ఫుటేజీ తీసి నిర్మాతలపై బడ్జెట్ భారం పెంచలేదు, ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే తీసుకున్నాడు’ అంటూ పరోక్షంగా ‘ఆచార్య’ దర్శకుడు కొరటాలకి చురకలు అంటించారు చిరు. 


ఈ క్రమంలో ఆచార్య సినిమా సమయంలో చిరంజీవి ఇచ్చిన ఇన్‌పుట్స్‌ను కొరటాల పట్టించుకోలేదని అందుకే సినిమా డిజాస్టర్ అయిందంటూ పోస్టులు పెడుతున్నారు. "

చిరంజీవి లాంటి లెజెండ్స్ ఇన్‌పుట్స్ తీసుకొని సినిమా తీస్తే ఇంద్ర, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి క్లాసిక్స్ వస్తాయ్. తీసుకోకుడా ఇష్టం వచ్చింది రాసుకొని తీస్తే ఆచార్య లాంటి డిజాస్టర్స్ వస్తాయ్. ఊరికే అయిపోతారా మెగాస్టార్లు." అంటూ కొరటాల శివను ట్రోల్ చేసారు.

మరోవైపు చిరంజీవి ఇన్వాల్‌మెంట్ ఎక్కువ అవడం వల్లే కొరటాల సరిగా సినిమాను డైరెక్ట్ చేయలేకపోయారంటూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా కొరటాల శివ  కూడా ఇండైరక్ట్ గా చిరంజీపై కౌంటర్స్ వేసారు తన తాజా చిత్రం దేవర ప్రమోషన్స్ లో .

‘దేవర’ ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ.. ‘నాకు ఇచ్చిన జాబ్..కి, ఐ యాం అకౌంటబుల్. ఆ ఒక్క భయం ఉంటే చాలు..ఇంకెవ్వడి భయం అవసరం లేదు. ఆ ఒక్క భయమే అడుగుతుంది. నీకో పని ఇచ్చారు.. అది చేసేశావ్. భయంతో..! అమ్మో… ఇది అవ్వకపోతే ఏంటి అనే భయం ఉంది.

ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని వాడు చేస్తే..! పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి ఆడిని ఇబ్బంది పెట్టి.. ఇది పెట్టి, మనది మనం చేయక… ఇంతకు మించింది ఏముంది’ అంటూ కొరటాల పరోక్షంగా చిరుకి చురకలు అంటించారు. ప్రస్తుతం కొరటాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Latest Videos

click me!