ముద్దు సన్నివేశంలో అలా అన్నానని శ్రీకాంత్ కోపంగా వెళ్లిపోయారు!

First Published Feb 4, 2021, 12:55 PM IST


సంగీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 2002లో దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఖడ్గం మూవీ ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ అవ్వాలని పట్నం వచ్చిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 

ఖడ్గం చిత్రానికి ముందే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సంగీతకు ఫేమ్ రాలేదు. ఖడ్గం సూపర్ హిట్ కావడంతో సంగీత తెలుగులో బిజీ అయ్యారు. అయితే హీరో శ్రీకాంత్ తో అత్యధికంగా ఐదు సినిమాలలో సంగీత నటించడం జరిగింది.
undefined
ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో తెరకెక్కి విజయాలు సాధించాయి. కాగా హీరో శ్రీకాంత్ తో జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురించి సంగీత అలీతో సరదాగా షోలో తెలియజేశారు.
undefined
మీరు శ్రీకాంత్ ని అన్నయ్య అంటారట కదా... ఏంటి ఆ కథ అని అడుగగా... సెట్స్ లో నేను శ్రీకాంత్ ని అన్నయ్య అని  పిలిచే దానిని. మా ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు కూడా డిస్కస్ చేసుకొనే వాళ్ళం.
undefined
శ్రీకాంత్ కూడా నన్ను తన ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేశేవారు. తన ఇంటి నుండి అడిగి మరీ నాకు క్యారేజ్ తెచ్చేవారు. అలాంటి శ్రీకాంత్ ఓ సారి విసుక్కోని పక్కకు వెళ్లిపోయారు.
undefined
సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ నాపై పడుకొని ముద్దుపెట్టాల్సిన సన్నివేశం ఉంది. నేను ఆ సీన్ ఇలా చేద్దాం అన్నయ్య, నాకు ఇక్కడ ఇలా ముద్దు పెట్టండి అన్నయ్యా.. అని చెవుతున్నాను.  అన్నిసార్లు అన్నయ్య అనకు, నాకు ఏదోలా ఉంది, డైరెక్టర్ గారు ఆమెకు చెప్పండి అని, కోప్పడ్డారట.
undefined
ఆ విషయాన్ని సంగీత అలీతో సరదాగా షోలో తెలియజేయడం జరిగింది.  కెరీర్ బిగినింగ్ లో ఖడ్గం మూవీలో మాదిరి, ఒక్క ఛాన్స్ అని అవకాశాల కోసం తిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని సంగీత తెలియజేయడం జరిగింది. స్క్రీన్ పై ఆ సన్నివేశం చూస్తుంటే ఆరోజులు గుర్తుకు వచ్చాయని సంగీత ఆ సందర్భంలో తెలిపారు.
undefined
ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న సంగీత మహేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్  సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించారు. అలాగే టీవీ షోలలో జడ్జి కూడా వ్యవహరిస్తున్నారు.
undefined
2009లో ప్లే బ్యాక్ సింగర్ క్రిష్ ని సంగీత వివాహం చేసుకోవడం జరిగింది.
undefined
click me!