కారులో స్నేహితుడు లైంగిక దాడి, భర్త విడాకుల బెదిరింపులు... బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

First Published Feb 4, 2021, 9:19 AM IST


బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్న 14వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రాఖీ సావంత్ తన మార్క్ గేమ్ తో ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. 
 

ఐతే గతంలో తనపై జరిగిన లైంగిక దాడి, భర్త వేధింపులు తోటి కంటెస్టెంట్ తో చెప్పుకొని రాఖీ సావంత్ కన్నీటి పర్యంతం అయ్యారు.  తన కెరీర్ బిగినింగ్ నుండి ఎదురైన కష్టాలు, ఇబ్బందులు గురించి రాఖీ సావంత్ చెప్పుకొని ఏడ్చేశారు.
undefined
రాఖీ భావోద్వేగానికి గురికాగా, తోటి కంటెస్టెంట్ రాహుల్ ఓదార్చే ప్రయత్నం చేశారు.  పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు ఎవరూ తెలియని దశలో రాఖీ అనేక రకాల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారట. వాళ్ళ అమ్మకు హార్ట్ అట్టాక్ రాగా, కనీసం వైద్య ఖర్చులకు డబ్బులు కూడా లేవని ఆమె అన్నారు.
undefined
ఇక ఓ సందర్భంలో తన స్నేహితుడు తనపై లైంగిక దాడి చేయబోయాడని రాఖీ తెలియజేశారు. కారులో ఇద్దరమే ఉన్న సమయంలో అతడు అడ్వాంటేజ్ తీసుకోవడంతో పాటు, మానసిక వేదనకు గురిచేసినట్లు రాఖీ సావంత్ తెలియజేయడం జరిగింది.
undefined
మరోవైపు తన భర్త కూడా తనను మానసికంగా హింసించినట్లు రాఖీ తెలపడం సంచలనంగా మారింది. తనకు విడాకులు ఇస్తానని భర్త రితేష్ బెదిరింపులకు పాల్పడ్డాడని రాఖీ సావంత్ తెలియజేశారు.
undefined
1997లో అగ్ని చక్ర అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన రాఖీ సావంత్ బాలీవుడ్ లో అనేక చిత్రాలలో నటించారు. గ్లామర్ రోల్స్ కి రాఖీ సావంత్ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు.
undefined
ఇక రాఖీ పదుల సంఖ్యలో ఐటెం సాంగ్స్ చేయడం జరిగింది. 2009లో నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ మూవీలో ఆమె ఐటెం సాంగ్ చేయడం జరిగింది.
undefined
తెలుగులో 16 టీన్స్ మూవీలో కూడా రాఖీ నటించారు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడం జరిగింది.
undefined
click me!