డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి ఫోటోలు... చూసి షాకైన ఫ్యాన్స్!

First Published Feb 4, 2021, 8:28 AM IST


డేటింగ్ యాప్ లో బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం ఫోటోలు కనిపించగా, ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఎదురైన ఈ చేదు అనుభవం గురించి తాజా ఇంటర్వ్యూలో పునర్నవి స్పందించారు. ఈ విషయంపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 

2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా చిత్రంతో వెండితెరకు పరిచయమైంది పునర్నవి. హీరో అంటే క్రష్ ఉండే పల్లెటూరి అమ్మాయిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి ఆమె మెప్పించారు.
undefined
ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం వంటి సినిమాలలో పునర్నవి హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే పునర్నవికి ఫేమ్ మాత్రం బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది.
undefined
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న పునర్నవి హౌస్ లో ప్రేమాయణం నడిపారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి రొమాన్స్ హైలెట్ కావడం జరిగింది. ఆ షోలో ప్రేమికులుగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న వీరిద్దరి రిలేషన్ షో ముగిసిన తరువాత కూడా కొనసాగింది.
undefined
రాహుల్, పునర్నవి పెళ్లి కూడా చేసుకోనున్నారని అప్పట్లో వరుస వార్తలు రావడం జరిగింది. ఇదిలా ఉంచితే తన ఫోటోలు డేటింగ్ యాప్ లో కనిపించడం తనని షాక్ గురిచేసిందని ఆమె చెప్పారు.
undefined
ఓ డేటింగ్ యాప్ లో తన పేరు తార, హాసినిగా మార్చి ఎవరో తన ఫోటోలు అప్లోడ్ చేశారట. తన ఫ్రెండ్స్ కొందరు ఆ విషయం గమనించి  తనకు ఫోన్ చేసి చెప్పారట. ఆ డేటింగ్ యాప్ లో నిజంగానే తన ఫోటోలు ఉన్నాయట.
undefined
తాను ఎప్పుడూ అలాంటి యాప్స్ వాడలేదని, తాను ఇంతవరకు ఎవరితో డేటింగ్ చేయలేదని పునర్నవి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
undefined
కాగా పునర్నవి నటించిన కమిట్ మెంటల్ వెబ్ సిరీస్ ఆదరణ దక్కించుకుంది.
undefined
click me!