అయితే ఇదంతా సరదాగా నాని మీద నాగార్జున చేసిన కామెంట్స్ మాత్రమే. ఆ మూవీలో నానిని నాగార్జున బాగా ఇబ్బందిపెడతాడు. దేవదాస్ మూవీలో పాత్రలను ఉద్దేశిస్తూ ఒకరిపై మరొకరు ఇలా ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక దేవదాస్ మూవీ సెట్స్ లో నాని ఎలా ఉండేవాడో కూడా నాగార్జున తెలియజేశాడు. నాని అస్తమానం ఫోన్ చూసుకుంటాడట. ఏం చూస్తాడో అర్థం కాదు. ఒక అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టినా కూడా నాని ఫోన్ చూసుకుంటాడని అన్నాడు.
ఇక దేవదాస్ మూవీ విడుదలై దాదాపు ఏడేళ్లు అవుతుంది. మరలా వీరి కాంబోలో చిత్రం తెరకెక్కలేదు. నాగార్జున ఈ ఏడాది మరో మల్టీస్టారర్ చేశారు. నా సామిరంగ టైటిల్ తో సంక్రాంతి బరిలో నిలిచాడు. అల్లరి నరేష్,రాజ్ తరుణ్ సైతం ఈ చిత్రంలో కీలక రోల్స్ చేశారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. నా సామిరంగ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.