శంకర్ మాస్టర్ స్ట్రోక్: ‘గేమ్‌ ఛేంజర్‌’పాటల బడ్జెట్

Published : Dec 30, 2024, 08:21 AM IST

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పాటల కోసం దర్శకుడు శంకర్ ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఐదు పాటల చిత్రీకరణలో వివిధ రాష్ట్రాల జానపద కళాకారులు, రష్యా నుండి డ్యాన్సర్లు పాల్గొన్నారు.

PREV
17
శంకర్ మాస్టర్ స్ట్రోక్: ‘గేమ్‌ ఛేంజర్‌’పాటల బడ్జెట్
ramcharan, game changer, shankar, dil raju


రామ్‌చరణ్‌  హీరోగా శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కియారా అడ్వాణీ హీరోయిన్. దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం  జనవరి 10న రానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్స్ ఊపు అందుకున్నాయి.

ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమాకు నిర్వహించని విధంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌ గ్లోబల్‌ ఈవెంట్‌’ పేరుతో (Game Changer Global Event) ప్రీరిలీజ్‌ వేడుక జరిపారు. అలాగే ఆదివారం విజయవాడలో అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ను నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు.  ఈ నేపధ్యంలో చిత్రానికి సంభందించిన విశేషాలు బయిటకు వస్తున్నాయి.

27


ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు కోసం దర్శకుడు శంకర్ పెట్టిన బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  మూమూలుగానే తన సినిమాల్లో పాటల కోసం విపరీతంగా ఖర్చు పెట్టి చిత్రీకరిస్తారు. తన తొలి చిత్రం "జెంటిల్‌మన్" నుండి, శంకర్ విజువల్స్,  వినూత్నమైన ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు.

తెరపై అద్భుతం సృష్టించటమే ఆయన  లక్ష్యం. ఇప్పుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన శంకర్ తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ పాటల చిత్రీకరణ కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
 

37


గేమ్‌ ఛేంజర్‌లో లో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, ప్రతీ పాటకూ తగినంత ప్రాధాన్యతనిచ్చి గ్రాండ్‌గా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. ఇందులో “జరగండి” పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ పాట కోసం 70 అడుగుల ఎత్తు కొండపై విలేజ్‌ సెట్‌ వేయడంతో పాటు, 600 మంది డ్యాన్సర్లతో 8 రోజులు పాటు షూట్‌ చేశారు. పర్యావరణానికి అనుకూలంగా జనపనారతో తయారైన కాస్ట్యూమ్స్‌ ఈ పాటలో వాడటం విశేషం.
 

47


ఇక “రా మచ్చా మచ్చా” అనే రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. భారతీయ జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ, 1000 మంది జానపద కళాకారులతో ఈ పాటను చిత్రీకరించారు. వివిధ రాష్ట్రాల జానపద నృత్య శైలులను కలిపి రూపొందించిన ఈ పాటకు గణేశ్‌ ఆచార్య నృత్యరూపకల్పన చేశారు. ఇది ప్రేక్షకులకు ఒక సాంస్కృతిక ఉత్సవంలా అనిపిస్తుందని చిత్రబృందం చెబుతోంది.
 

57


ధోప్‌ సాంగ్‌ కోసం రష్యా నుండి ప్రత్యేకంగా 100 మంది డ్యాన్సర్లను హైదరాబాద్‌ తీసుకురావడం, ఐదో పాటను గోదావరి పరిసరాల్లో చిత్రీకరించడం సినిమాకే అదనపు ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఈ పాటను థియేటర్లో చూడటం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని టాక్‌. ఈవిధంగా, పాటలలోనే భారీ పెట్టుబడులు పెట్టిన గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.

67


 దర్శకుడు శంకర్‌ అభిమానులు ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపంలో ఓ బెస్ట్‌ మూవీని చూడబోతున్నారని రామ్‌చరణ్ అన్నారు.  రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌కు ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్‌ పెద్దేశ్వర్‌.. దిల్‌రాజు, రామ్‌చరణ్‌ యువశక్తి ప్రతినిధులు, మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ ద్వారా భారీ కటౌట్‌పై పూల వర్షాన్ని కురిపించారు. అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. 

77


దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాలో రామ్‌చరణ్‌ (Ram Charan) నట విశ్వరూపాన్ని చూస్తారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో సినిమాకు సంబంధించిన భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. దీనికి సంబంధించి త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) కలిసి చర్చిస్తాం. చిరంజీవి ఈ సినిమా చూసి సంక్రాంతికి భారీ హిట్‌ ఖాయమని, అభిమానులకు ఈ విషయాన్ని చెప్పమని ఫోన్‌ చేసి మరీ చెప్పారు. సినిమాలకు పుట్టినిల్లయిన విజయవాడలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. జనవరి 1న ట్రైలర్‌ను విడుదల చేస్తామ’’ని చెప్పారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories