‘గుంటూరు కారం’ రీ రిలీజ్: అన్ని షోలా?, యాంటి ఫ్యాన్స్ కుళ్లు కునేలా

Published : Dec 30, 2024, 08:43 AM IST

2024 సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రం త్వరలో రీ-రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు అభిమానులు ఈ రీ-రిలీజ్ పై ఆసక్తిగా ఉన్నారు.

PREV
16
‘గుంటూరు కారం’ రీ రిలీజ్:  అన్ని షోలా?, యాంటి ఫ్యాన్స్ కుళ్లు కునేలా
Mahesh Babus Guntur Kaaram

గత కొద్ది కాలంగా రీరిలీజ్ ట్రెండ్ తెలుగులో ఊపు అందుకుంది. చాలా సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్స్ లోకి వచ్చి అభిమానులను అలరించాయి. అయితే అవన్నీ చాలా ఏళ్ల క్రితం రిలీజైన సినిమాలు. లేటెస్ట్ సినిమాలు రీరిలీజ్ లు అవ్వలేదు.

కానీ 2024 సంక్రాంతికి రిలీజైన మహేష్ బాబు  చిత్రం ‘గుంటూరు కారం’మాత్రం రీ రిలీజ్ కు రెడీ అయ్యింది.  వాస్తవానికి థియేటర్స్ లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కమర్షియల్ గా ఈ సినిమా సేఫ్ అని నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు రీరిలీజ్ కు ఈ సినిమా వస్తూండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర ఏ స్దాయి సందడి చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది ట్రేడ్.

26


నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆహ్వానంగా, డిసెంబర్ 31న 'గుంటూరు కారం' చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రీ-రిలీజ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్లలో ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమవగా, కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయినట్లు సమాచారం.
 

36


మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్‌కు మూడేళ్ల సమయం ఉండటంతో, ఈ గ్యాప్‌ను మహేశ్ అభిమానులు ఆయన గత చిత్రాలను రీ-రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఈ ఏడాది మురారి రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ అవుతున్న ''గుంటూరు కారం' థియేటర్స్ లో అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తుంది అంటున్నారు. డిసెంబర్ 31 రాత్రి ‘గుంటూరు కారం’ చిత్రానికి  50+ షోలు పడనున్నాయి.
 

46
Mahesh Babus Guntur Kaaram

‘గుంటూరు కారం’ సినిమా 2024 సంక్రాంతి పండుగ‌ సందర్బంగా రిలీజైంది. స్టార్  హీరో - స్టార్ డైరక్టర్ కాంబినేషన్ లో  సినిమా అంటే ఆ హంగామానే వేరు. ‘గుంటూరు కారం’ విష‌యంలో అదే జ‌రిగింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన సినిమా ఇది.  సినిమా రిజల్ట్ సోసోగా ఉన్నా రమణగా మహేశ్‌ (Mahesh Babu) మాస్‌ అవతార్‌ మెప్పించింది. శ్రీలీల (Sreela) అందాలతో అలరించింది. 

56


మహేశ్ తన కెరీర్‌లో ఎప్పుడూ వేయని మాస్ స్టెప్పులను ,మహేష్ ఈ సినిమాలో వేశారు. అందులో శ్రీలీలతో కలిసి చేసిన "కుర్చీ మడతపెట్టి" సాంగ్ అయితే ఈ ఏడాదిలో ఆడియన్స్ నుంచి అత్యంత ఆదరణ పొందిన పాటల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

 

ఓటీటీల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో చాలా వారాల పాటు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. అందుకే 2025 న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేస్తున్నారు.  రిలీజ్ టైంలో సినిమా  బాలేదు అని చెప్పిన జనాలు.. రీ రిలీజ్ టైంలో వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు. 

66

కథేంటంటే:

వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు). చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోవ‌డంతో ర‌మ‌ణ గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రిరావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు. వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు.

వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి... ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడ‌తాడు. వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. (Guntur Kaaram  ) త‌ల్లిని ఎంతో ప్రేమించే ర‌మ‌ణ... ఆ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టాడా?ఇంత‌కీ అందులో ఏముంది?త‌న త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? క‌న్న కొడుకుని వ‌సుంధ‌ర ఎందుకు వ‌దిలిపెట్టింది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

click me!

Recommended Stories