Ntr-Anr
ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ లెజెండ్స్. గొప్ప నటులు. వీరి తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు స్టార్డం అనుభవించారు. ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలుగా చలామణి అయ్యారు.
Tollywood Stars
అనంతరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... తెలుగు సినిమాను ఏలారు. మిడ్ ఎయిటీస్ లో వీరి ప్రభావం మొదలైంది. నైంటీస్ ఆరంభానికి స్టార్డం తెచ్చుకున్నారు. మిగతా ముగ్గురితో పోల్చితే చిరంజీవి కొంచెం ముందే స్టార్ హోదా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే సోలోగా సత్తా చాటుతున్నారు. నాగార్జున, వెంకటేష్ చిత్రాలు సోలోగా ఆడటం లేదు. అందుకే మల్టీస్టారర్స్ ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ అతిపెద్ద హీరోలుగా వెలుగులోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో ఆయన సినిమాల మీద దృష్టి తగ్గించారు. గతంలో మాదిరి క్వాలిటీ చిత్రాలు ఆయన నుండి రావడం లేదు. ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ చిత్రాల పట్ల ఆసక్తిపోయింది. అభిమానులు మాత్రమే ఆదరిస్తున్నారు.
ప్రభాస్ టాలీవుడ్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్. బాహుబలి, బాహుబలి 2తో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. అదంతా రాజమౌళి పుణ్యమే అన్న విమర్శలు వినిపించాయి. ఈ విమర్శలకు సాహో, కల్కి విజయాలతో చెక్ పెట్టాడు. ఈ రెండు నార్త్ లో కూడా సత్తా చాటాయి. అత్యధిక కలెక్షన్స్ రికార్డ్స్ ప్రభాస్ పేరిట ఉన్నాయి. పుష్ప, దేవర చిత్రాలతో అల్లు అర్జున్, ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో నిరూపించుకోవాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి చిత్రం కావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు క్రెడిట్ దక్కలేదు. ఇక మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయలేదు. అయినప్పటికీ నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న హీరో. ఆయన టాప్ 5 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో ఉన్నారు. నెక్స్ట్ రాజమౌళితో మహేష్ బాబు మూవీ చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ ఫేమ్ ఎల్లలు దాటనుంది.
Nagarjuna Akkineni
సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున... వీరిలో తన ఫేవరేట్ హీరో ఎవరో? ఎందుకో? చెప్పాడు. 2010లో నటి జయప్రద హోస్ట్ గా జయప్రదం పేరుతో ఒక టాక్ షో ప్రసారమైంది. ఈ షోకి గెస్ట్ గా నాగార్జున వచ్చారు. ఈ తరం హీరోల్లో ఎవరు మంచి నటుడు? అని జయప్రద అడిగారు. నాగార్జున తడబడకుండా.. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు.
జూనియర్ ఎన్టీఆర్ కి డైలాగ్ మీదున్న పట్టు అద్భుతం. అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ప్రకాష్ రాజ్ వంటి నటులకు డైలాగ్ మీద చాలా కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ మరలా నేను ఎన్టీఆర్ లో చూశాను. అతడు గొప్ప డాన్సర్. ఆ విషయం పక్కన పెడితే.. డైలాగ్ గుర్తు పెట్టుకోవడం, దాన్ని అనర్గళంగా చెప్పడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టం.. అని నాగార్జున అన్నారు.
Nagarjuna Akkineni
నాగార్జున మంచి నటుడు. విభిన్నమైన పాత్రలు చేసిన మెప్పించాడు. అలాంటి ఓ సీనియర్ హీరో ప్రశంసలు దక్కడం గొప్ప విషయం. కాగా జూనియర్ ఎన్టీఆర్ తో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. నాగార్జునను ఎన్టీఆర్ బాబాయ్ అని పిలుస్తారు. ఎన్టీఆర్ ఫాదర్ హరికృష్ణ సైతం నాగార్జునకు అత్యంత సన్నిహితుడు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
హరికృష్ణ-నాగార్జున కాంబోలో సీతారామరాజు తెరకెక్కింది. ఈ మూవీ సూపర్ హిట్. హరికృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు హరికృష్ణ అని నాగార్జున, ఎవరు మీలో కోటీశ్వరుడు? షోకి గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ తో చెప్పడం విశేషం.