నటించమంటే చెట్టెక్కి కూర్చున్న మహేష్... వాడు ఎవరి మాట వినడన్న కృష్ణ, అప్పుడు ఏం జరిగిందంటే?

First Published Apr 10, 2024, 5:28 PM IST

ఓ స్టార్ డైరెక్టర్ వచ్చి నటించమంటే మహేష్ బాబు చెట్టెక్కి కూర్చున్నాడట. నేను నటించను అన్నాడట. కృష్ణ వాడు ఎవడు చెప్పినా వినడు. కావాలంటే ఒప్పించుకోండని వదిలేశాడట. అసలు ఏం జరిగింది?
 

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమపై తిరుగులేని ముద్ర వేశారు. అత్యంత ఫ్యాన్ బేస్ అనుభవించాడు. ఆయన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. 

మహేష్ నట ప్రస్థానం పసి ప్రాయంలోనే మొదలైంది. పొత్తిళ్లలో బిడ్డగా ఉండగానే నీడ అనే మూవీలో మహేష్ కనిపించాడు. బాల నటుడిగా చేసిన మొదటి చిత్రం మాత్రం పోరాటం. ఈ మూవీ 1983లో విడుదలైంది. కృష్ణ-జయసుధ హీరో హీరోయిన్ గా నటించారు. కోడి రామకృష్ణ దర్శకుడు. 

పోరాటం మూవీలో కృష్ణకు తమ్ముడు పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని కోడి రామకృష్ణ భావించారట. ఈ విషయాన్ని కోడి రామకృష్ణ కృష్ణతో చెప్పారట. మీ తమ్ముడు పాత్రకు మహేష్ చక్కగా సరిపోతాడు. మహేష్ తో చేయిద్దాం అన్నారట. 

కోడిరామకృష్ణ మాటలు విన్న కృష్ణ... వాడు ఎవరి మాటా వినడు. నటించేందుకు ఒప్పుకోడు. కావాలంటే నువ్వు ఒప్పించుకో, అన్నాడట. పోరాటం మూవీ సెట్స్ లో ఆడుకుంటున్న మహేష్ వద్దకు వెళ్లిన కోడి రామకృష్ణ... బాబు నువ్వు నటిస్తావా? అని అన్నాడట. నేను నటించను అని మహేష్ అన్నాడట. 

మీ నాన్న పోలికలు నీకున్నాయి. తమ్ముడు పాత్రకు సెట్ అవుతావు. ఇది మంచి పాత్ర అని మహేష్ తో కోడి రామకృష్ణ అన్నారట. నేను చేయను అని మహేష్ అన్నారట. ఎందుకు చేయవని కోడి రామకృష్ణ అడిగాడట. నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మా నాన్నను చూశాను. నా వల్ల కాదని మహేష్ చెట్టు ఎక్కి కూర్చున్నాడట. 

ఎట్టకేలకు కోడి రామకృష్ణ మహేష్ ని ఒప్పించాడట. అప్పటికి మహేష్ వయసు కేవలం 7 ఏళ్ళు. పోరాటం మూవీలో తండ్రి కృష్ణతో కలిసి నటించాడు మహేష్. తర్వాత బాలనటుడిగా మరో ఏడు సినిమాలు చేశాడు. తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ తో మల్టీస్టారర్స్ చేశాడు. 

డ్యూయల్ రోల్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్స్ లో మహేష్ ఒకడు. బాల్యంలోనే మల్టీస్టారర్స్, లీడ్ రోల్స్, ఫైట్స్వంటి చేసిన సాహసాలు చేసిన అరుదైన నటుడు. తన మొదటి చిత్రం లో నటించడానికి మాత్రం మారాం వేశాడట. 1999లో విడుదలైన రాజకుమారుడు చిత్రంతో మహేష్ పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

click me!