కూర్చీని కాదు, నాలుకని మడతపెట్టిన జాన్వీ కపూర్‌.. `దేవర` బ్యూటీలో ఉన్న సీక్రెట్‌ టాలెంట్ ఏంటో తెలుసా?

Published : Apr 10, 2024, 05:09 PM IST

జాన్వీ కపూర్‌.. టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. సౌత్‌లో అప్‌కమింగ్‌ సెన్సేషన్‌గా మారుతుంది. తాజాగా ఆమె ఇచ్చిన ట్విస్ట్ మతిపోయేలా ఉంది.   

PREV
18
కూర్చీని కాదు, నాలుకని మడతపెట్టిన జాన్వీ కపూర్‌.. `దేవర` బ్యూటీలో ఉన్న సీక్రెట్‌ టాలెంట్ ఏంటో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా, ఆమె వారసత్వాన్ని పునికిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చింది జాన్వీ కపూర్‌. హిందీలో నాలుగైదు సినిమాలు చేసింది. కానీ సరైన విజయాలు దక్కలేదు. కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చే సినిమా పడలేదు. కానీ సౌత్‌లో ఆమె రెండు భారీ ఆఫర్లని అందుకుంది. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. తెలుగు సినిమాల్లో నటించే అవకాశం దక్కడమే జాన్వీకి బ్రేక్‌లా మారిపోయింది. 
 

28

 సౌత్‌ ఎంట్రీ ఇస్తూ తెలుగులో `దేవర` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా చేస్తుంది. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్‌ సరసన జాన్వీ హీరోయిన్‌ అనే ప్రకటనే ఆమెని నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ చేసేసింది. పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ పడితే వచ్చేంత పేరు కంటే డబుల్‌ వచ్చిందనే చెప్పాలి.

38

దీనికితోడు ఆమె ఇటీవల రామ్‌ చరణ్‌తోనూ జోడి కట్టేందుకు సిద్ధమైంది. బుచ్చిబాబు చిత్రంలోనూ హీరోయిన్‌గా ఆమెనే హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీ కూడా ప్రారంభమైంది. రెండు పాన్‌ ఇండియా సినిమాల్లో ఛాన్స్ లు రావడంతో జాన్వీ రేంజ్‌ మారిపోయింది. సినిమాల రిలీజ్‌లకు ముందే ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

48

ఇక సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీచూపించే టాలెంట్‌ నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుంది. అసలు ఈమె శ్రీదేవి కూతురేనా అని ఆశ్చర్యపోయేలా ఆమె గ్లామర్‌ షో చేస్తుంది. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. అందుకే సోషల్‌ మీడియాలో జాన్వీకి ఉన్న క్రేజ్‌ మామూలు కాదు. ఆమె ఇచ్చే ట్రీట్‌ కూడా బౌండరీలు బ్రేక్‌ అయ్యేలా ఉంటున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

58

ఇదిలా ఉంటే తాజాగా టాలెంట్‌ని బయటపెట్టింది జాన్వీ కపూర్‌. టంగ్‌ తో ట్విస్ట్ ఇచ్చింది. మైండ్‌ బ్లాక్‌ చేసింది. తనలోని అసలు టాలెంట్‌ చూపించి ఆశ్చర్యపరిచింది. ఇటీవల మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం`లో ఆ కుర్చీని మడత పెట్టి అనే పాట సంచలనంగా మారింది. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. అయితే తాను మాత్రం నాలుక మడత పెడతా అంటోంది జాన్వీ. మరి ఆ సంగతేంటో చూస్తే..
 

68

జాన్వీ కపూర్‌లో ఉన్న హిడెన్‌ టాలెంట్‌ ఏంటో కాదు నాలుకని మడత పెట్టడమే. ఆమెకి నాలుకని మడత పెట్టే టాలెంట్‌ ఉంది. అయితే రెగ్యూలర్‌గా అందరు నాలుక మడత పెడతారు, అందులో టాలెంట్‌ ఏముందనే డౌట్‌ రావచ్చు. అయితే జాన్వీ మడత పెట్టేది 360 డిగ్రీస్‌లో కావడం విశేషం. అంతేకాదు ఆమె ఏకంగా ఆ నాలుకని 360 డిగ్రీల్లో మెలితిప్పి చూపించింది. 
 

78

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. జాన్వీలోని ఈ సీక్రెట్‌ టాలెంట్‌ని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. మహేష్‌ బాబు కుర్చీని మడత పెడితే జాన్వీ నాలుకని మడత పెడుతుందంటూ సెటైర్లు, ప్రశంసలతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. 
 

88

జాన్వీ కపూర్‌ తెలుగులో ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటిస్తుంది. యంగ్‌ తారక్ పాత్రకి ఆమె జోడీగా కనిపిస్తుందట. ఇందులో ఎన్టీఆర్‌ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. దీంతోపాటు రామ్‌ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా ఇటీవలే ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ స్టార్ట్ కానుంది. దీంతోపాటు హిందీలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది జాన్వీ కపూర్‌. చూడబోతుంటే ఆమె హిందీ కంటే సౌత్‌పైనే ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories