Published : Apr 10, 2024, 04:57 PM ISTUpdated : Apr 10, 2024, 05:07 PM IST
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజాగా ఓ సీక్రెట్ ను రివీల్ చేశారు. అది కూడా ఆయన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
కోలీవుడ్ నటుడు, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) కి తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులూ ఎదురుచూస్తూ ఉంటారు.
26
‘సలీమ్’, ‘అస్త్రం’, ‘బిచ్చగాడు’ వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మల్టీటాలెంట్ ఉన్న ఈయనకు జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.
36
ఈ సందర్భంగా అభిమానులు ఆయన గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తన గురించి ఓ విషయాన్ని తెలియజేశారు.
46
అది కూడా తన లవ్ స్టోరీలపై నిర్మోహమాటంగా స్పందించారు. ఆయన మొత్తంగా ఐదుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇక ఆరోసారి తన భార్యతోనే లవ్ లో పడ్డానన్నారు.
56
ఐదు సార్లు తన ప్రేమలో విఫలం కావడానికి కారణం తన సింప్లిసిటీ, ప్లేన్ లైఫ్ స్టైల్ అని చెప్పారు. తను మొదటి నుంచి అలాగే పెరిగానని, అమ్మాయిల విషయంలో ఇలా జరిగిందన్నారు.
66
మొత్తానికి విజయ్ ఆంటోనీ తన లవ్ స్టోరీస్ గురించి ఓపెన్ కావడం ఇప్పుడంతా హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక విజయ్ ఆంటోనీ 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. కాగా గతేడాది ఆయన పెద్ద కూతురు మరణించిన విషయం తెలిసిందే.