చిరంజీవికి ఓ సినిమా విషయంలో అదే జరిగిందట. ఆయనకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఓ మూవీ కథ దర్శకుడికి, నిర్మాతకు నచ్చలేదట. బీ. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అశ్వినీదత్ ఓ మూవీ చేయాలనుకున్నారట. బీ.గోపాల్, అశ్వినీదత్ కథలు వింటున్నారు. నరసింహనాయుడు మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందించిన చిన్ని కృష్ణకు ఆఫర్ ఇచ్చారు.
బీ. గోపాల్, బాలకృష్ణ, చిన్ని కృష్ణ కాంబోలో వచ్చిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం పరుచూరి బ్రదర్స్ అందించారు. అందుకే బీ. గోపాల్ మరోసారి చిన్ని కృష్ణతో పని చేసేందుకు ఆసక్తి చూపారు. చిన్ని కృష్ణ దాదాపు ఆరు నెలలు పని చేసి ఓ కథను సిద్ధం చేశారట. బీ. గోపాల్, అశ్వినీ దత్ లకు ఆ కథ వినిపించాడట. వారికి కథ నచ్చలేదట.