ప్రభాస్ కథ ఎన్టీఆర్ కి ఎలా వెళ్ళింది? ఎవరు రాజకీయం చేసారు?

First Published | Oct 28, 2024, 9:48 AM IST

దర్శకుడు సురేందర్ రెడ్డి తన రెండవ సినిమా ప్రభాస్ తో చేయాలనుకున్నప్పటికీ, ఎన్టీఆర్ మేనేజర్ ఒత్తిడి కారణంగా ఎన్టీఆర్ తో 'అశోక్' సినిమా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభాస్ కోసం రాసుకున్న కథ కాకుండా వేరే కథతో ఈ సినిమా తీయాల్సి వచ్చిందని, ఈ నిర్ణయం తనకు ఇష్టం లేకుండానే జరిగిందని ఆయన వెల్లడించారు.

Surender Reddy, Prabhas, tollywood,ntr

ఒక హీరో చేయాల్సిన సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి  మరొక హీరో చేతిలోకి వెళ్లడం కామన్ గా జరిగేది. అలాగే  ఒకరి హీరోతో చేయాలనుకుని ఫిక్సైన దర్శకుడు, మరో హీరోవైపు అనుకోని పరిస్దితిల్లో వెళ్లటం కూడా అంతే  సహజం. అయితే అలా వెళ్లిన కథలు అన్ని హిట్టవుతాయననే నమ్మకం లేదు. వాటిల్లో కొన్ని హిట్టయితే, మరికొన్ని ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి.  అలాంటి సిట్యువేషన్ ఒకటి ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోతున్నాము.
 

Surender Reddy, Prabhas, tollywood,ntr



అప్పట్లో ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ వైపు వెళ్లారు. ఆ విషయాన్ని రీసెంట్ గా సురేంద్రరెడ్డి స్వయంగా చెప్పారు. దాదాపు అన్నీ దాదాపు ఫైనల్ అయ్యాయి కూడా. అప్పుడే ఊహించని విధంగా సీన్ లోకి సురేందర్ రెడ్డికి బాగా కావాల్సిన వ్యక్తి ఎంటర్ అయ్యాడు. సీన్ మొత్తం మార్చేశాడు. అలా ప్రభాస్ తో సినిమా చేయాల్సిన సురేందర్ రెడ్డి, ఎన్టీఆర్ ప్రాజెక్టుపైకి వచ్చాడు.


Surender Reddy, Prabhas, tollywood,ntr



ఆ సినిమా మరేదో కాదు  “అశోక్”. మొదటి సినిమా అతనకొక్కడే చిత్ర బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, దర్శకుడు సురేందర్ రెడ్డికి వరుసగా అవకాశాలొచ్చాయి. ఇందులో భాగంగా తన రెండో సినిమాను ప్రభాస్ తో చేయడానికి రెడీ అయ్యాడు సురేందర్ రెడ్డి.  అశోక్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు.  

ఎన్టీఆర్‌తో అశోక్ తీసిన చాలా కాలం తర్వాత.. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు తియ్యాల్సి వచ్చిందో తెలిపారు సురేందర్ రెడ్డి. అసలు తనకిష్టం లేకుండా ఆ సినిమా చేసానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌తో సురేందర్ రెడ్డి చేసిన అశోక్ సినిమాని సురేందర్ రెడ్డి ఇష్టపడి చేయలేదట. బలవంతం మీద ఒప్పుకున్నాడట.
 


ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని.. తన వెంట తిరిగాడని, లేదంటే తాను ప్రభాస్‌తో సినిమా చేసేవాడినని.. ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యాలంటూ ఒత్తిడి తేవడమే కాకుండా తనని అక్కడిక్కడికి తిప్పాడని, అసలు తాను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని చెప్పకుండానే.. ఎన్టీఆర్‌తో సినిమా ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దామంటూ మాట్లాడడంతో... కాస్త ఇబ్బందిపడినా.. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరో కాబట్టి.. తాను ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు.
 


అలాగే అసలు అశోక్ కథ తనది కాదని, ప్రభాస్ కోసం  అనుకున్న ఆ  కథ వేరని చెప్పుకొచ్చారు. వారిచ్చిన స్క్రిప్టుతోనే తాను ఎన్టీఆర్ కోసమే అశోక్ సినిమా చెయ్యాల్సి వచ్చిందని, అశోక్ కథ తనకి సెట్ అయ్యేది కాకపోయినా.. ఇష్టం లేకుండానే ఆ సినిమా చేసానని చెబుతున్నాడు.

మరి నిజంగా ఎన్టీఆర్ మేనేజర్  అశోక్ కథతో తనకో మాస్ సినిమా చెయ్యమని సురేందర్ రెడ్డి వెంటపడి ఉంటాడా...? మరి సురేందర్ రెడ్డి చెప్పేది చూస్తుంటే... ఎన్టీఆర్ మేనేజర్ బలవంతంగా ఒప్పించినట్టే కనబడుతుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


 తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు సురేందర్ రెడ్డి. ‘‘అవును నా రెండో చిత్రం ప్రభాస్‌తో తీయాలనుకున్నా. కానీ, కుదరలేదు. ‘అతనొక్కడే’ విజయం తర్వాత నాకు పలు అవకాశాలు వచ్చాయి. అయితే, అప్పటికే ప్రభాస్‌తో సినిమా చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నా. అదే సమయంలో తారక్‌తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నన్ను కోరారు. ఆయన మాట కాదనలేక సినిమా చేయడానికి ఒప్పుకొన్నా.

పైగా అప్పటికి ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనతో చేయకపోతే బాగుండదేమోనని వెళ్లి తారక్‌ను కలిశా. చర్చల అనంతరం ఓ ప్రాజెక్టును ఓకే చేశారు. అదే ‘అశోక్‌’. అయితే, ఇది ప్రభాస్‌తో తీద్దామనుకున్న కథ కాదు. అప్పటికే కథ సిద్ధంగా ఉండటంతో చిన్న చిన్నమార్పులతో సినిమా తెరకెక్కించా’’ అనిఅప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ ప్రభాస్ తో సినిమా చేయలేకపోయాడు. గతేడాది “ఏజెంట్” సినిమా చేశాడు ఈ దర్శకుడు. అది డిజాస్టర్ అయింది. 
 

Latest Videos

click me!