నీ కడుపులో సమస్య ఉంది. నువ్వు బయటకు వెళ్లి మంచి వైద్యుడికి చూపించుకోవడం మంచిదని డాక్టర్స్ సూచించారు. అందుకే నేను వెళ్లిపోతున్నా.. అన్నాడు. నిజమా అని నయని పావని తనపై ఒట్టు వేయించుకుంది. అవునని అవినాష్ చెప్పడంతో తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, నయని పావని ఆవేదన చెందారు. విష్ణుప్రియ, రోహిణి బాగా ఏడ్చేశారు.
బిగ్ బాస్ హౌస్ మెయిన్ డోర్స్ మరోసారి తెరుచుకున్నాయి. అవినాష్ వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ప్రస్తుత సీజన్ కి అవినాష్ ప్రధాన ఆకర్షణ. అతడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అవినాష్ బిగ్ బాస్ హౌస్ ని వీడటం మైనస్. ప్రేక్షకులు చాలా నిరాశకు గురవుతున్నారు.