పరువు పోతుందని బన్నీ మూవీ ఛాన్స్ వదులుకున్న డైరెక్టర్ బాబీ... ఆసక్తికర కథనం

First Published Jul 11, 2021, 9:14 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ తో మూవీ ఛాన్స్ అంటే ఎవరైనా వదులుకుంటారా.. దర్శకుడు బాబీ మాత్రం పరువుపోతుందని పిలిచి అవకాశం ఇచ్చినా వదులుకున్నాడట. 
 

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన రెండవ కుమారుడైన అల్లు అర్జున్ ని గంగోత్రి చిత్రంతో లాంఛ్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గంగోత్రి చిత్రానికి దర్శకుడు కాగా, కథను స్టార్ రైటర్ చిన్ని కృష్ణ అందించారు.
undefined
అప్పట్లో గుంటూరు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్న బాబీతో చిన్ని కృష్ణకు పరిచయం ఉంది. ఇంద్ర మూవీకి చిన్ని కృష్ణ కథను అందించగా ఆ మూవీ భారీ విజయం సాధించడంతో గుంటూరులో చిన్ని కృష్ణను బాబీ కలిశారట.
undefined
హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమని బాబీకి చిన్ని కృష్ణ చెప్పారట. దీనితో హైదరాబాద్ వెళ్లిన బాబీని రాఘవేంద్రావుకు పరిచయం చేశారట చిన్ని కృష్ణ. అలాగే వేషం ఇవ్వాలని కోరారట. దీనితో బాబీని నిక్కర్ ధరించాలి, కొలతలు ఇవ్వమని రాఘవేంద్రరావు చెప్పారట.
undefined
హీరో పక్కన ఉండే ఓ పాత్ర కోసం నిక్కరు వేసుకొని నటించాలని చెప్పడంతో బాబీ.. నావల్ల కాదని అన్నారట. నిక్కర్ వేసుకొని నటిస్తే గుంటూరులో నా పరువు పోతుందని అన్నాడట.
undefined
మరి ఏమి చేస్తావ్ అని అడుగగా... కథలు రాస్తానని చెప్పాడట. గంగోత్రి మూవీ కోసం కొన్ని సన్నివేశాలు రాయమనగా, బేబీ అద్భుతమైన సన్నివేశాలు రాసి ఇచ్చారట.
undefined
అలా నటుడిగా అల్లు అర్జున్ మూవీ వదులుకున్న బాబీ, రైటర్, దర్శకుడు అయ్యాడు. రవితేజ, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి స్టార్స్ తో మూవీస్ చేసిన బాబీ, నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
undefined
click me!