Chiranjeevi: ముప్పై ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ కి లిప్ కిస్ పెట్టిన చిరంజీవి... కానీ విడుదలకు ముందు భయంతో

Published : Feb 18, 2022, 02:21 PM IST

అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లిప్ కిస్ పెడితే అదో పెద్ద సెన్సేషన్, కాంట్రవర్సీ. సామాజిక వాదులు, రాజకీయవేత్తలు వామ్మో అంటూ గగ్గోలు పెట్టారు. అప్ కోర్స్ వాళ్ళు అలా విషయం పెద్దది చేయడం వలన మరింత మంది ఆ సినిమా చూసి పెద్ద హిట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ నిక్కర్ వేసుకునే రోజుల్లోనే మెగా స్టార్ చిరంజీవి లిప్ కిస్ సీన్ చేశాడని చాలా మందికి తెలియదు.   

PREV
17
Chiranjeevi: ముప్పై ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ కి లిప్ కిస్ పెట్టిన చిరంజీవి... కానీ విడుదలకు ముందు భయంతో

కెరీర్ లో ఒకే ఒక్క హీరోయిన్ తో చిరు (Chiranjeevi)ఆ సన్నివేశం చేశారు. చిరు అధరాలను ముద్దాడిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ అరుదైన ముద్దు వెనుక ఉన్న నేపథ్యం ఏమిటో? తెలుసుకుందాం.. 90ల నాటికి చిరంజీవి కెరీర్ పీక్స్ కి చేరింది. వరుస బ్లాక్ బస్టర్స్ తో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా చిరు అవతరించాడు. చిరుతో సినిమా అంటే కాసుల పంటే అనే నమ్మకం దర్శక నిర్మాతల్లో నాటుకుపోయింది.

27

చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు (K Raghavendrarao) దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నెక్స్ట్ మూవీ ఘరానా మొగుడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రాఘవేంద్రరావు ఘరానా మొగుడు తెరకెక్కించాడు. నగ్మా మెయిన్ హీరోయిన్ కాగా, వాణి విశ్వనాథ్ సెకండ్ హీరోయిన్. 
 

37

రాఘవేంద్రరావు అంటే రొమాంటిక్ సన్నివేశాలకు పెట్టింది పేరు. సాంగ్స్ లో హీరోయిన్స్ ని ఆయన చూపించినంత గ్లామర్ గా మరో దర్శకుడు చూపించలేదు. హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో రాసుకుంటారు. ఈ క్రమంలో దర్శకేంద్రుడు మదిలో ఓ చిలిపి ఆలోచన పురుడు పోసుకుంది.

47

పండు పండు... సాంగ్ లో నగ్మా(Nagma)తో లిప్ కిస్ సీన్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ముప్పై ఏళ్ల క్రితం టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ అంటే అదో సంచలనం. చెట్లు, కొమ్మలు, పూలు అడ్డుపెట్టి మేనేజ్ చేసే రోజులవి. లిప్ లాక్ సన్నివేశం అంటే బూతుగా భావించే ఆ రోజుల్లో చిరంజీవి లాంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో చేయడమంటే అతి పెద్ద సాహసమే. 
 

57

అంత పెద్ద సీనియర్ దర్శకుడు అడిగితే కాదనలేని పరిస్థితి. హీరోయిన్ నగ్మా పెద్దగా సంశయించకుండానే లిప్ కిస్ సీన్ కి ఓకె అన్నారు. చిరంజీవి మాత్రం ససేమిరా అని కూర్చున్నారు. ఎంత చెప్పినా రాఘవేంద్రరావు వినే మూడ్ లో లేరు. చేసేది లేక పండు పండు.. సాంగ్ లో చిరంజీవి నగ్మాతో లిప్ లాక్ సన్నివేశం చేశారు.

67


అయితే చిరంజీవి మనసు మాత్రం అంగీకరించడం లేదు. తన ఫ్యాన్స్, ఆడియన్స్ ఆ సన్నివేశాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం వెంటాడుతూనే ఉంది. ఆలోచించి చించి... చిరు బుర్ర ఫ్రై అయిపోయింది. ఆయన ఏమనుకున్నా పర్లేదు, ఒప్పించి ఆ సీన్ ఎడిట్ చేయించాలని డిసైడ్ అయిన చిరంజీవి, సాంగ్ నుండి లిప్ లాక్ సీన్ తొలగించేలా చేశారు. 

77

మరి చిరంజీవి ఆ సీన్ తొలగించకుండా ఉండి ఉంటే అప్పటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునేవారో తెలిసేది. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఘరానా మొగుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎం ఎం కీరవాణి సాంగ్స్ యువతను ఊపేశాయి. ఘరానా మొగుడు రూ. 10 కోట్ల షేర్ రాబట్టి రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు చిరంజీవి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

click me!

Recommended Stories