కాస్కో నిఖిల్ పార్టీలో అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో కలసి హాజరైన నిహారిక, క్రేజీ పిక్స్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 18, 2022, 01:06 PM IST

ప్రముఖ యూట్యూబర్ కాస్కో నిఖిల్ తన వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు. నిహారిక కలసి నిఖిల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఓటిటి చిత్రాలు కూడా చేశారు.   

PREV
112
కాస్కో నిఖిల్ పార్టీలో అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో కలసి హాజరైన నిహారిక, క్రేజీ పిక్స్ వైరల్

ప్రముఖ యూట్యూబర్ కాస్కో నిఖిల్ తన వీడియోలతో బాగా పాపులర్ అయ్యారు. నిహారిక కలసి నిఖిల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో షార్ట్ ఫిలిమ్స్, ఓటిటి చిత్రాలు కూడా చేశారు. 

 

212

భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న కాస్కో నిఖిల్ సెలెబ్రిటీగా మారిపోయాడు. టాలీవుడ్ సెలెబ్రిటీలతో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. 

 

312

 నిఖిల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగు పెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తన సన్నిహితులకు స్నేహితులు అదిరిపోయే పార్టీ ఇచ్చాడు. 

 

412

ఈ పార్టీకి చాలా మంది సెలెబ్రిటీలు, నిఖిల్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. అనసూయ, నిహారిక కొణిదెల, నటుడు ప్రిన్స్, దేత్తడి హారిక మరికొందరు సెలెబ్రిటీలు హాజరయ్యారు. 

 

512

నిహారిక తన భర్త చైతన్యతో కలసి ఈ పార్టీకి వచ్చింది. నిఖిల్ పార్టీలో సెలెబ్రటీలంతా ఫుల్ జోష్ లో కనిపించారు. 

 

612

ఇక అనసూయ లుక్ అయితే షాకిచ్చే విధంగా ఉంది. జీన్స్ జాకెట్, ప్యాంట్ లో అనసూయ పెద్దగా మేకప్ లేకుండా కనిపిస్తోంది. హాట్ గా ఉంటూనే విభిన్నమైన లుక్ లో అందరిని ఆకర్షించింది ఈ దాక్షాయణి. 

 

712

ఇక నిహారిక తన భర్తతో చిరునవ్వులతో కనిపించింది. గ్రీన్ గౌన్ లో నిహారిక హాట్ హాట్ గా కనిపించింది. నిహారిక, చైతన్య ఇద్దరూ సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. 

 

 

812

నిహారిక, నిఖిల్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. నిహారిక, నిఖిల్ ఇప్పటికి డిజిటల్ ఫ్లాట్ ఫామ్, ఓటిటీల కోసం షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. 

 

912

నాలుగేళ్ల నుంచి నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఆ తర్వాత అతడు కాస్కో అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఈ యూట్యూబ్ ఛానల్ కి ప్రస్తుతం 4లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. 

 

1012

ప్రస్తుతం నిఖిల్ టాలీవుడ్ లో పరిచయాలు పెంచుకుంటూ నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ట్యాలెంట్ ఉన్న యువకులకు ఓటిటి వరంలా మారుతోంది. 

 

1112

ఇక యూట్యూబర్స్ చాలా మంది బిగ్ బాస్ లో అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. షణ్ముఖ్, సిరి, హారిక లాంటి వారంతా బిగ్ బాస్ లో పాల్గొన్నారు. 

 

1212

మరి కాస్కో నిఖిల్ కూడా భవిష్యత్తులో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడు. 

click me!

Recommended Stories