7వ వారం సైతం నాగ మణికంఠ ఓటింగ్ లో టాప్ 3-4 లో ఉన్నాడు. టేస్టీ తేజ, గౌతమ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. కానీ నాగ మణికంఠ స్వయంగా వెళ్లిపోతానని చెప్పడంతో... నాగార్జున ఫైనల్ గా కంటెస్టెంట్స్ ఓటింగ్ తీసుకున్నాడు. మెజారిటీ ఇంటి సభ్యులు నాగ మణికంఠకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఎలిమినేట్ అయ్యాడు.
కాగా తాను బిగ్ బాస్ షోకి వచ్చిందే భార్య పిల్లల కోసమని నాగ మణికంఠ పలుమార్లు వెల్లడించాడు. వారు తనకు దక్కాలన్న, అత్తారింటిలో గౌరవం పొందాలన్న బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అనేవాడు. అలాంటి నాగ మణికంఠ ప్రేక్షకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా, బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో నాగ మణికంఠ భార్య ప్రియ రియాక్షన్ ఏమిటనే చర్చ మొదలైంది.