నాకు ఐదుసార్లు పెళ్లి అయిపోయింది.. అన్నారు. ఎవరెవరితో అని జయప్రద అడిగారు. నాతో పని చేసిన కో స్టార్స్ తో అని అనుష్క అన్నారు. ఎవరెవరు అని జయప్రద అడిగారు. సుమంత్, గోపీచంద్, ప్రభాస్, సెంథిల్ తో పాటు మరొకరి తో తనకు పెళ్లి అంటూ, ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వెలువడ్డాయని అనుష్క వెల్లడించారు.
కెరీర్ బిగినింగ్ లో అనుష్క... సుమంత్, గోపీచంద్ లతో కూడా నటించారు. గోపీచంద్-అనుష్క ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లపై అనుష్క స్పందించలేదు. అలాగే రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్ తో అనుష్క పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. అనంతరం సెంథిల్ కుమార్ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి అనుష్క కూడా హాజరైంది.