గతంలోకి ప్రయాణం: ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై నీల్ క్లారిటీ

First Published | Dec 23, 2024, 7:20 AM IST

'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. ఆ సినిమా రిజల్ట్ ప్రక్కన పెడితే ఆయన తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టారు. త్వరలో ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభిస్తున్నారు.

Prashanth Neel, NTR Jr, kgf


'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. ఆ సినిమా రిజల్ట్ ప్రక్కన పెడితే ఆయన తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టారు. త్వరలో ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ నేపధ్యంలో ఆ చిత్రం ఏ జానర్ లో నడవనుంది. ఎలాంటి కాన్సెప్టు , టైటిల్ ఏంటనే విషయాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

NTR-Prasanth Neel


'దేవర' సూపర్ హిట్‌తో ఎన్టీఆర్ మంచి ఉషారుగా ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ సినిమా మైథలాజికల్ కాన్సెప్ట్ తో వస్తుందనే రూమర్ నడుస్తోంది. తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చాడు నీల్. ఎన్టీఆర్ తో పీరియాడికల్ మూవీ చేస్తున్నానని, మైథలాజికల్ కాదని తెలిపాడు. 


NTR-Prasanth Neel


“ఎన్టీఆర్ తో మైథలాజికల్ సినిమా చేయడం లేదు. కెరీర్లో ఒక మైథలాజికల్ మూవీ చెయ్యాలనే ఐడియా ఉంది. కానీ ఈ మూవీ ఇప్పుడు తారక్ తో చెయ్యడం లేదు,” అని క్లారిటీ ఇచ్చాడు. “అదొక పీరియాడిక్ మూవీ. నా మైండ్ లో ఓ మైథలాజికల్ కాన్సెప్ట్ ఉంది. గతంలో ఇదే విషయాన్ని చెప్పాను కూడా. కానీ తారక్ తో చేయబోయే సినిమాకు, నా మైండ్ లో ఉన్న మైథలాజికల్ కాన్సెప్ట్ కు సంబంధం లేదు.” అని ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పారు. 

NTR, PRASANTH NEEL


మరోవైపు ‘సలార్-2’పై కూడా స్పందించాడు ప్రశాంత్ నీల్. ‘సలార్-2’ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఎన్టీఆర్ సినిమా తర్వాత అది ఉంటుందని తెలిపాడు. తన కెరీర్ లోనే ది బెస్ట్ వర్క్ ‘సలార్-2’ అంటున్నాడు నీల్. ఇక ‘దేవర-1’సూపర్ హిట్ అయినా  వెంటనే ‘దేవర-2’ స్టార్ట్ చేయడం లేదు ఎన్టీఆర్. ముందుగా అతడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 

NTR-Prasanth Neel


ఇకపోతే ఈ సినిమా స్టోరీ బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఇక ఈ చిత్రానికి  ‘డ్రాగన్‌’అనే టైటిల్  ప్రచారంలో ఉంది. . ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ఎన్టీఆర్‌ లేని సన్నివేశాలను షూట్ చేస్తారని, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆరంభించే కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ కూడా జాయిన్‌ అవుతారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్‌ గెటప్స్‌లో ఎన్టీఆర్‌ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందించనున్నారు. 

Latest Videos

click me!