Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌

Published : Feb 27, 2026, 08:21 PM IST

అల్లు అర్జున్‌ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. టాలీవుడ్‌ లో బిగ్‌ స్టార్స్ లో ఒకరు. అయితే ఇంట్లో మాత్రం ఆయన వేరే అట. చాలా ఎమోషనల్‌ అట. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌ బయటపెట్టారు. 

PREV
14
ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తోన్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ ఒకప్పుడు స్టయిలీష్‌ స్టార్‌గా రాణించేవారు. కానీ `పుష్ప`తో ఆయన ఐకాన్‌ స్టార్‌ అయ్యారు. ఇక ఇప్పుడు అట్లీతో చేయబోతున్న `ఏఏ 22`తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదగబోతున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశారు. దీన్ని సైన్స్ ఫిక్షన్‌ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మేజర్‌ వర్క్ సెట్‌లోనే ఉంటుంది. కొంత వరకు బయట షూటింగ్‌ చేస్తారు. అది త్వరలో ప్రారంభిస్తారని సమాచారం.

24
బన్నీ ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇంట్లో బన్నీ ఎలా ఉంటారు?, సినిమా రిలీజ్‌ అయితే ఎలా రియాక్ట్ అవుతారు. ఆయన సినిమాలో ఎమోషన్స్ సీన్స్ వస్తే ఏం చేస్తారనేది లీక్‌ అయ్యాయి. తండ్రి అల్లు అరవింద్‌ ఈ విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్నాళ్ల క్రితం సమంత హోస్ట్ గా చేసిన `సామ్‌ జాబ్‌` షోలో బన్నీ, అల్లు అరవింద్‌ పాల్గొన్నారు. ఇందులో క్రేజీ విషయాలను షేర్‌ చేసుకున్నారు.

34
ఇంట్లో మొత్తం అల్లు అర్జున్‌ హడావుడి

సినిమా చూస్తున్నప్పుడు ఎమోషనల్‌ సీన్లు వస్తే ఇంట్లో ఏడ్చేది ఎవరంటే అల్లు అర్జున్‌ అని తెలిపారు అల్లు అరవింద్‌. ఆయన ఊరికే ఏడ్చేస్తాడని వెల్లడించారు. ఆ విషయంలో చాలా సెన్సిటివ్‌ అని వెల్లడించారు. మరోవైపు ఇంట్లో బాగా సౌండ్‌ చేసేది, అరిచేది ఎవరనే ప్రశ్న సమంత అడగ్గా, అల్లు అర్జునే అని చెప్పాడు అరవింద్‌. ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ బన్నీ వాయిస్‌ వినిపిస్తుందని చెప్పారు.

44
సినిమా రిలీజ్‌ అయితే బన్నీలోకి టెన్షన్‌

ఇక ఈ సందర్భంగా ఇంట్లో ఎక్కువగా ఖర్చు చేసేది ఎవరనే ప్రశ్నకి రియాక్ట్ అవుతూ అల్లు అర్జునే అని చెప్పారు. ఈ విషయంలో మరో డౌట్‌ లేదని, బాగా ఖర్చు చేస్తాడని చెప్పారు. దీనికి బన్నీ రియాక్ట్ అవుతూ, తండ్రి సంపాదిస్తున్నప్పుడు కొడుకు ఖర్చు చేయాలి కదా అని నవ్వుతూ వెల్లడించడం విశేషం. ఇంట్లో ఫైనల్‌ గా చెప్పేది ఎవరనేది అడిగితే అల్లు అర్జున్‌ పేరే చెప్పారు అరవింద్‌. మొత్తంగా అరవింద్‌ ఇంట్లో బన్నీదే హవా అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన సినిమా రిలీజ్‌ అవుతుందంటే బన్నీ బాగా టెన్షన్‌ పడతాడట. ఆ రోజు ఎవరూ తన వద్దకు కూడా రారని చెప్పారు. బన్నీ కూడా ఈ విషయాన్ని ఒప్పుకోవడం విశేషం. చాలా రోజుల నాటి ఈ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories