Spirit Update: `స్పిరిట్‌`లో వివేక్‌ ఒబెరాయ్‌.. అంచనాలకు అందని సందీప్‌ రెడ్డి ప్లాన్‌

Published : Feb 27, 2026, 06:49 PM IST

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `స్పిరిట్‌` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో మరో కొత్త పాత్రని పరిచయం చేశారు సందీప్‌ రెడ్డి వంగా. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

PREV
14
`స్పిరిట్‌` మూవీ అప్‌ డేట్‌

ప్రభాస్‌ హీరోగా `స్పిరిట్‌` మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇందులో డిమ్రి తృప్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించాల్సింది. కానీ ఆయన మధ్యలోనే తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన అనేక క్రేజీ విషయాలు చక్కర్లు కొట్టాయి. సినిమాలో కాస్టింగ్‌ అదిరిపోతుందని అన్నారు. చిరంజీవి పేరు వినిపించింది. మరోవైపు విజయ్‌ దేవరకొండని కూడా అనుకుంటున్నారని టాక్‌ వినిపించింది.

24
`స్పిరిట్‌`లో వివేక్‌ ఒబెరాయ్‌

కానీ ఇప్పుడు ఊహించని కాస్టింగ్‌ని దించాడు సందీప్‌ రెడ్డి వంగా. `రక్తచరిత్ర`, `వినయ విధేయ రామ` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న వివేక్‌ ఒబెరాయ్‌ని దించాడు. ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఆయన పాత్ర గురించిన వివరాలు వెల్లడించలేదు. కానీ పవర్‌ఫుల్ లుక్‌లో అదరగొడుతున్నారు వివేక్‌ ఒబెరాయ్‌. ఆయనకు సరైన పాత్ర పడితే యాక్టింగ్‌తో రచ్చ చేస్తారు. ఇప్పుడు చూడబోతుంటే సాలిడ్‌ రోల్‌ పడిందని ఈ లుక్‌ని బట్టి అర్థమవుతుంది.

34
విలన్‌ రోల్‌లో వివేక్‌ ఒబెరాయ్‌

ఈ లుక్‌లో వివేక్‌ ఒబెరాయ్‌ ఒక రిచ్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిలా ఉన్నాడు. కత్తిపట్టుకుని సోఫాపై నిలబడ్డాడు. చాలా కోపంగా చూస్తున్నారు. నోట్లో చుట్ట ఉంది. రాయల్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు వివేక్‌. అయితే ఆయనది ఇందులో విలన్‌ రోల్‌ అని తెలుస్తోంది. కాకపోతే ఈ లుక్‌లో ముందు నటి ఐశ్వర్యా దేశాయ్‌ కూర్చొని ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. ఇదే అంతు చిక్కడం లేదు. సందీప్‌ రెడ్డి ప్లాన్‌ ఏంటి? ఏం చూపించదలుచుకున్నాడనేది అర్థం కావడం లేదు. కానీ భారీగానే ప్లాన్‌ చేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తోంది.

44
పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌

`స్పిరిట్‌` మూవీని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు సందీప్‌ రెడ్డి వంగా. ఇందులో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆయన చాలా డేంజరస్‌ పోలీస్ అని టాక్‌. ఇటీవలే ప్రభాస్‌పై మూవీ షూటింగ్‌ జరిపారు. ఇప్పుడు బ్రేక్‌ ఇచ్చినట్టు టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories