ఎన్టీఆర్ ముందే ఓ స్టార్ హీరోయిన్ పరువు తీసేశాడట ఏఎన్నార్. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అంటారు. మొదటి తరం కమర్షియల్ హీరోలు వీరు. అతిపెద్ద స్టార్డం, ఫ్యాన్ బేస్ ఇద్దరికీ ఉండేది. నువ్వా నేనా అన్నట్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేవారు. ఎన్టీఆర్ మాస్, పౌరాణిక చిత్రాలలో తన మార్క్ చూపించారు. మరోవైపు క్లాస్ సబ్జెక్ట్స్ తో ఎన్టీఆర్ ని ఏఎన్నార్ ఢీకొట్టారు.
ఎన్టీఆర్-ఏఎన్నార్ లలో ఉన్న గొప్ప క్వాలిటీ.. వారు స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సంకోచించేవారు కాదు. ఫ్యాన్ రైవల్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేయడం అరుదైన విషయం. టఫ్ కాంపిటీషన్ ఉండి కూడా.. మల్టీస్టారర్స్ చేసేవారు. కొన్ని చిత్రాల్లో ఒకరి పాత్రకు ప్రాధాన్యత తక్కువ ఉండేది. అయినప్పటికీ ఇగో వదిలేసి నటించేవారు.
ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబోలో ఏకంగా 15 సినిమాలు తెరకెక్కాయని సమాచారం. ఇది అరుదైన రికార్డు. 70ల తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో జయసుధ, జయప్రద, శ్రీదేవి, వాణిశ్రీ, శారద, లక్ష్మి, జయ చిత్ర వంటి హీరోయిన్స్ అత్యధికంగా చిత్రాలు చేశారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద ముందు వరుసలో ఉన్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మల్టీస్టారర్ రామకృష్ణులు చిత్రంలో జయసుధ, జయప్రద హీరోయిన్స్ గా నటించారు. ఎన్టీఆర్ తో జయసుధ జతకట్టగా, ఏఎన్నార్ తో జయప్రద ఆడిపాడింది. ఈ మూవీ లాంచింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. శివాజీ గణేశన్ గెస్ట్ గా హాజరై ఫస్ట్ క్లాప్ కొట్టాడు.
Ntr-Anr
అప్పుడు శ్రీదేవి, జయప్రదలను ఉద్దేశించి ఏఎన్నార్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. స్లిమ్ గా ఉండేదుకు అన్నం సరిగా తినడం లేదనుకుంటా... అని జయప్రదతో ఏఎన్నార్ అన్నాడట. అదేమీ లేదు. నా శరీరమే ఇంత అని జయప్రద సమాధానం చెప్పిందట.
అనంతరం జయసుధను ఉద్దేశిస్తూ... నువ్వు మాత్రం కాస్త ఒళ్ళు చేశావు అన్నాడట ఏఎన్నార్. అది మంచిదే కదా అని ఎన్టీఆర్ అన్నారట. మిమ్మల్ని దృష్టిలో ఉంచుకునే జయసుధ లావు అవుతున్నట్లు ఉందని, ఏన్నార్ మరో ఛలోక్తి వదిలాడట. అది కూడా మంచిదే అని, ఎన్టీఆర్ అన్నారట.
Ntr-Anr
జయసుధకు ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోయిందట. ఆ రోజుల్లో నటులు అందరూ తెలుగువారే. రిపీటెడ్ గా అనేక సినిమాలు చేసేవాళ్ళు. దాని వలన ఒకరితో మరొకరికి గట్టి అనుబంధం ఉండేది. ఆ చనువుతో ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెప్పుకునేవాళ్ళు.
అదే ఈ రోజుల్లో ఓ హీరోయిన్ శరీరం మీద హీరో జోక్స్ వేస్తే... అది బాడీ షేమింగ్ అవుతుంది. కంప్లైంట్ చేస్తే కేసు అవుతుంది. అంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇక 1978లో విడుదలైన రామకృష్ణులు మూవీ భారీ విజయం అందుకుంది. వంద రోజులకు పైగా ఆడింది.
ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబోలో మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి క్లాసిక్స్ తెరకెక్కాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. నేను చేసిన కొన్ని కామెంట్స్ ఆయన గురించే అని కొందరు చాడీలు చెప్పడంతో.. సీఎం అయిన ఎన్టీఆర్ తనను ఇబ్బంది పెట్టాడని ఏఎన్నార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.