హ్యాట్రిక్ ఫ్లాపుల ఎఫెక్ట్.. మెగా హీరో భయంతో ఇలా..

First Published | Sep 26, 2024, 12:30 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి సక్సెస్ అందుకుని చాలా కాలం అవుతోంది. వరుణ్ తేజ్ చివరగా నటించిన గని. గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి సక్సెస్ అందుకుని చాలా కాలం అవుతోంది. వరుణ్ తేజ్ చివరగా నటించిన గని. గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ చిత్రాలన్నీ వరుణ్ తేజ్ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. 

ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల లీకైన వరుణ్ తేజ్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచింది. వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మూడు గెటప్పులో కనిపిస్తాడట. టీనేజ్ నుంచి మధ్య వయస్కుడి వరకు వరుణ్ తేజ్ కనిపిస్తాడని అంటున్నారు. 


ఈ చిత్రం ప్రతి విషయంలో వరుణ్ తేజ్ ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాల పరాజయాల దృష్ట్యా వరుణ్ తేజ్ మట్కా చిత్రంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రతి సన్నివేశం అవుట్ పుట్ విషయంలో ఇతరుల అభిప్రాయం తీసుకుంటున్నారట. పాజిటివ్ వస్తేనే ఆ సీన్ ని ఫైనల్ చేస్తున్నారు. 

ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మట్కా హిట్ కాకుండా వరుణ్ తేజ్ కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ భయంతోనే వరుణ్ తేజ్ ప్రతి అంశంలో జాగ్రత్త వహిస్తున్నారు. మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సినిమా ఉండాలని భావిస్తున్నారు. 

Latest Videos

click me!