సల్మాన్ ఖాన్‌తో తన పాత రిలేషన్‌షిప్, బ్రేకప్‌పై ఐశ్వర్య రాయ్ చాలా ఏళ్ల క్రితం చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. 'నాలోని రాక్షసులను వదిలించుకున్నా' అని ఆమె ఎందుకన్నారో తెలుసా.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఇప్పుడు అభిషేక్ బచ్చన్ భార్య. కానీ, ఒకప్పుడు సల్మాన్ ఖాన్‌తో ఆమె నడిపిన ప్రేమాయణం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది. ఆ బంధం ముగిసిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య, 'నాలోని రాక్షసులను వదిలించుకున్నాను' అని చెప్పి సంచలనం రేపింది. ఆ పాత సంఘటన ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
24
ఐశ్వర్య-అభిషేక్ విడాకులపై పుకార్లు..
ఐశ్వర్య రాయ్ గురించి తెలియనివారుండరు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు. సినిమాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ గురించే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆమె అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని, ఆరాధ్య అనే కూతురికి తల్లిగా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ మధ్య వీరిద్దరి దాంపత్యంలో అంతా సరిగ్గా లేదని పుకార్లు వచ్చినా, ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
34
ఐశ్వర్య, సల్మాన్ బంధం
సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య పాత ప్రేమ వ్యవహారం ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఒకప్పుడు ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ బంధంలో చాలా గొడవలు, మనస్పర్థల మధ్య నడిచిందని అంటుంటారు. ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని, సల్మాన్ ఐశ్వర్యపై చేయి చేసుకున్నాడనే ఆరోపణలు కూడా వినిపించాయి. బ్రేకప్ తర్వాత, సల్మాన్ గురించి ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఐశ్వర్య నేరుగా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేది.
2012లో సిమి గరెవాల్ టాక్ షోలో ఐశ్వర్య పాల్గొన్నారు. అప్పుడు సిమి, సల్మాన్‌తో రిలేషన్‌షిప్ గురించి అడిగారు. దానికి ఐశ్వర్య, "నేను ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను. దాని గురించి ఏ విధంగానూ మాట్లాడటానికి నేను ఇష్టపడను, ముఖ్యంగా పబ్లిక్‌గా అస్సలు మాట్లాడను" అని స్పష్టం చేశారు. అప్పుడు సిమి, "ఆ విషయంపై మీకు ఇంకా కోపం ఉందా?" అని అడిగారు. దానికి ఐశ్వర్య, "నాలోని రాక్షసులను నేను వదిలించుకున్నాను. అదంతా పాత కథ, దాన్ని అక్కడితో వదిలేయాలి" అని ఖరాఖండిగా సమాధానమిచ్చారు.