Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?

Published : Jun 12, 2026, 10:32 PM IST

వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించిన `పోలీస్‌ కంప్లైంట్‌` మూవీ ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే? 

PREV
15
పోలీస్‌ కంప్లైంట్‌ మూవీ రివ్యూ

వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నవీన్‌ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలు పోషించిన మూవీ `పోలీస్‌ కంప్లైంట్‌`. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్‌కే ప్రమీద శ్రీ ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. వరలక్ష్మి పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన ఈ మూవీ ఇటీవల బాగా వార్తల్లో నిలిచింది. వరలక్ష్మి, నవీన్‌ చంద్ర ప్రమోషన్స్ కి రావడం లేదంటూ దర్శకుడు చేసే ఆరోపణలతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దర్శకుడు నోరు జారడం, వరలక్ష్మి కౌంటర్‌ ఇవ్వడం, ఆ తర్వాత దర్శకుడు సారీ చెప్పడం, ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగిపోయింది. కానీ ఇది సినిమాకి మంచి ప్రమోషన్‌ తెచ్చిపెట్టింది.ఈ వివాదం నడుము నేడు శుక్రవారం(జూన్‌ 10న) ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
పోలీస్‌ కంప్లైంట్‌ మూవీ కథ

గర్భిణి హత్య జరిగి చాలా ఏళ్లు అవుతుంది. అయినా కేసుని పోలీసులు పట్టించుకోరు. ఆమెపై క్షుద్రపూజలు జరిగినట్టు, దానివల్లే ఆమె మరణించినట్టు అనుమానాలుంటాయి. కానీ నిజం ఏంటో తెలియదు. ఈ క్రమంలో డాడీ కావాలని చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్‌ ఇస్తుంది. ఆ తర్వాత ఆ పాప డాడీ అని పిలిచిన వారంతా ఒక్కొక్కరు చనిపోతుంటారు. ఈ క్రమంలో ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) ఈ కేసుని టేకప్‌ చేస్తుంది.  గర్భిణి కేసు కూడా మళ్లీ తెరపైకి వస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌ భర్త రామ్‌(నవీన్‌ చంద్ర)కి సంబంధించిన షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. దీంతో పోలీస్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ హత్యల వెనుక ఏం జరుగుతుంది? వారిని చంపింది ఎవరు? ఎందుకు చంపేస్తారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? విచారణలో బయటపడ్డ నిజాలేంటి? చివరికి తెలిసిన నిజం ఏంటనేది మిగిలిన సినిమా. 

35
పోలీస్‌ కంప్లైంట్‌ మూవీ ఎలా ఉందంటే

క్రైమ్‌ థ్రిల్లర్‌, హర్రర్‌ థ్రిల్లర్‌ ఇటీవల కాలంలో చాలానే వస్తున్నాయి. కానీ కొన్ని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. హర్రర్‌, థ్రిల్లర్‌ అంశాలు ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే సినిమా సక్సెస్‌ అయినట్టే. అయితే వాటిని అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలోనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఈ చిత్ర దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఈ విషయంలో సక్సెస్‌ అయ్యారనే చెప్పొచ్చు. `చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ` అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో హర్రర్‌, మిస్టరీ, యాక్షన్ అంశాలను సమపాళల్లో మేళవించడంలో ఆయన విజయం సాధించారు. సినిమా మొదటి భాగం మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగుతుంది, ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తులో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు  కట్టిపడేస్తాయి. ముఖ్యంగా హర్రర్‌ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలంగా నిలుస్తాయి. కథ రెగ్యూలర్‌గానే ఉన్నా, హర్రర్‌, థ్రిల్లర్‌ అంశాలు మెప్పిస్తాయి. నవీన్‌ చంద్ర పాత్రలోని ట్విస్ట్ బాగుంది. వరలక్ష్మి పాత్ర ఆద్యంతం కట్టిపడేస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణకి నివాళి అర్పిస్తూ వచ్చే పాట హైలైట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. అయితే కథనం స్లోగా సాగుతుంది. ట్విస్ట్ లు పెద్దగా మెప్పించలేకపోయాయి. డ్రామా ఆశించిన స్థాయిలో పండలేదు. హర్రర్‌ అంశాలు ఇంకా బాగా డీల్‌ చేయాల్సింది. థ్రిల్లర్‌ అంశాలు ఓకే, కాకపోతే ఇంకా బాగా చేయాల్సింది. దాని డోస్‌ తగ్గిందనిపిస్తుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఓవరాల్‌గా కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పే సందేశం బాగుంది.

45
పోలీస్‌ కంప్లైంట్‌లో నటీనటులు ఎలా చేశారంటే?

రామ్‌ పాత్రలో నవీన్‌ చంద్ర బాగా చేశారు. సహజంగా మెప్పించాడు. తనకు యాప్ట్ గా నిలిచే పాత్రలో అదరగొట్టాడు. పోలీస్ అధికారిగా వరలక్ష్మి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో ఆమె అదరగొట్టింది.  ఎమోషనల్‌ సీన్లలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన నటన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది గ్లామర్‌తో పాటు కథకు అవసరమైన ప్రాధాన్యం ను తీసుకొచ్చారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి నటులు కామెడీ ద్వారా మంచి రిలీఫ్ అందించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు పోలీసు పాత్రల్లో నటించిన నటులు జెమిని సురేష్, విజయభాస్కర్ సరదాగా, సీరియస్ గా సాగే పాత్రాల్లో చాలా బాగా నటించి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 

55
పోలీస్‌ కంప్లైంట్‌ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకులు ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం హారర్ సీన్లని మరింత ఎలివేట్ చేసింది. కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం అభిమానులకు మంచి ట్రీట్‌గా నిలుస్తుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ కథనాన్ని గ్రిప్పింగ్ గా సాగేలా సహాయపడింది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ కూడా థ్రిల్లర్ అనుభూతిని పెంచాయి. దర్శకుడు సినిమాని చాలా వరకు బాగా డీల్‌ చేశాడు. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఫైనల్‌గా

 హర్రర్‌, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది.

రేటింగ్‌ : 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories