ధనుష్,ఐశ్వర్య విడాకులు: బయిటకురాని అసలు కారణం? వయస్సు పెద్దదైనా లవ్ స్టోరీ

First Published Apr 9, 2024, 8:10 AM IST

 18 ఏళ్ల వైవాహిక బంధం మొదట్లో బాగానే గడిచింది.  ఒక విషయం వీరిద్దరి మద్య బంధం వీగిపోవటానికి కారణమైందంటున్నారు. అదేమిటంటే..


హీరో ధనుష్, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో ధరఖాస్తు చేసి మరోసారి వార్తలకు ఎక్కారు.  దాదాపు 18 ఏళ్లు పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడిపోయిన రెండేళ్ల తర్వాత విడాకుల కోసం తాజాగా కోర్టును ఆశ్రయించారు.


2004 నవంబర్ 18న ధనుష్, ఐశ్యర్య వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిప్రాయభేదాలు కారణంగా 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్​పై త్వరలో విచారణ జరగనుంది. అయితే అసలు వీరు ఎందుకు విడిపోయి విడాకులు తీసుకుంటున్నారనే అంతటా హాట్ టాపిక్ గా మారింది.


తమిళ నటుడు ధనుష్‌ (Dhanush), రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya) దంపతులు 18 ఏళ్ల వైవాహిక బంధం మొదట్లో బాగానే గడిచింది. వీళ్లిద్దరూ చాలా  అన్యోన్య దాంపత్యం క్రిందే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తమ దాంపత్యానికి  ముగింపు పలుకుతున్నామంటూ రెండేళ్ల క్రితం అనౌన్స్‌ చేశారు. అయితే కారణం ఏమిటన్నది ఇద్దరిలో ఎవరూ బయిటకు చెప్పలేదు. కానీ ఒక విషయం వీరిద్దరి మద్య బంధం వీగిపోవటానికి కారణమైందంటున్నారు. అదేమిటంటే..


ధనుష్ మొదటి నుంచి పనే  జీవితం అన్నట్లు వెళ్లే వర్కో హాలిక్. ధనుష్ ని ఎరిగున్న ఎవరైనా ఈ విషయం చెప్తారు. షూటింగ్, సినిమా పని ఉన్నదంటే మిగతావేమీ పట్టించుకోడు ధనుష్. తన సినిమా కమిట్మెంట్స్ దృష్ట్యా చాలా సిటీలకు, ప్రాంతాలకు సిటీ వదలి అవుట్ డోర్ వెళ్తూంటారు. అది ఫ్యామిలీ లైఫ్ పై తీవ్రంగా దెబ్బ పడేలే చేసింది. 


తను కష్టపడి ఎవరి అండా లేకుండా ఈ స్దాయికి వచ్చానని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ధనుష్ మొదటి నుంచి చెప్తూండేవారు. అనేక ఇంటర్వూలలో కూడా ఈ విషయం చెప్పేవారు. ఐశ్వర్యతో ఏదైనా గొడవ పడినా వెంటనే కొత్త సినిమా కమిటయ్యి అందులో బిజీ అయ్యిపోయేవాడని తమిళ సినిమా వర్గాలు చెప్తున్నాయి. 


పనిలో ఎంగేజ్ అవుతున్నాను అనుకున్నాడే కానీ ప్యామిలీకు దూరం అవుతున్నాడని భావించలేదు. ధనుష్ గురించి తెలిసుకున్న ఎవరైనా చెప్తారు. అతను ఎక్సట్రీమ్ గా ప్రెవేట్ పర్శన్ అని. తన క్లోజ్ ప్రెండ్స్ తో కూడా కుటుంబ విషయాలు షేర్ చేసుకోరు. దాంతో అతను మనస్సులో ఏముంది అనేది ఎవరికి తెలియదు.


తమ రిలేషన్ షిప్ లో వివాదం వచ్చినప్పుడల్లా షూటింగ్ పేరట దూరంగా వెళ్లిపోయి..పనిలో పడి మర్చిపోవటానికి ప్రయత్నించేవారు. అంతేకానీ సమస్యను పరిష్కార దిసగా ఏ ప్రయత్నం చేయలేదు. అందుకు కారణం తమ మామగారు రజనీకాంత్ కావటంతో  ...ఆమెతో గొడవలు పడితే ఖచ్చితంగా తన కెరీర్ పై ఇంపాక్ట్ పడుతుందని ప్రారంభ రోజుల్లో భావించేవారట. కెరీర్, కుటుంబం మధ్య ధనుష్ నలిగిపోయారని అంటారు.


ఐశ్వర్య ఇష్టపడి ధనుష్ ని పెళ్లి చేసుుకందని , కానీ కుటుంబానికి తగినంత స్పేస్ ఇవ్వమని ఆమె అడిగేదని , అది ధనుష్ వల్ల కాలేదని చెప్తున్నారు. అంతకు మించి వాళ్లిద్దరి మధ్యా చెప్పుకోదగ్గ గొడవలు అయితే లేవు అని అంటున్నారు. ఈ క్రమంలో నే తాజాగా వీరిద్దరూ విడాకులకు అప్లయ్‌ చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టును సంప్రదించి.. మ్యూచువల్ కన్సెంట్ కింద విడాకులు కోరినట్లు తెలుస్తోంది. 

లవ్ స్టోరీ ఇలా మొదలైంది

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఐశ్వర్య పెద్ద కుమార్తె. చదువుకునే రోజుల్లో ధనుష్‌ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. దీంతో ఆమె తరచూ ధనుష్‌ వాళ్లింటికి వెళ్లి వస్తుండేవారు. అలా, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. వయసులో తనకంటే పెద్దదైన యువతిని ప్రేమించడం కరెక్టా?, కాదా? అని మొదట సందేహపడిన ధనుష్‌.. కొంతకాలానికి ఆమెతో ప్రేమను అధికారికంగా ప్రకటించాడు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్‌ 18న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.  
 


2022లో ధనుష్, ఐశ్వర్య ఒక లేఖ ద్వారా తాము విడిపోతున్నట్లు తెలిపారు. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్‌ ట్విటర్‌లో ఉంచిన లేఖలో పేర్కొన్నారు. ఐశ్వర్య సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదే లేఖను పోస్టు చేశారు. ఆ లేఖకు ఎలాంటి క్యాప్షన్‌ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని ఐశ్వర్య పేర్కొంది.


 ధనుష్ సినిమా విషయాలకొస్తే ఈ ఏడాది 'కెప్టెన్ మిల్లర్'​ సినిమాతో ఆడియెన్స్​ను పలకరించారు. 'రాయన్' అనే థ్రిల్లర్ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'కుబేర' చిత్రంలోనూ నటిస్తున్నారు. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్​గా తెరకెక్కనున్న 'ఇళయరాజా' సినిమాలో లీడ్ రోల్ చేయనున్నారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్​ తర్వాత ఐశ్వర్య 'లాల్​ సలామ్'​ చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఫ్రిబవరిలోనే విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.

2004 నవంబర్ 18న ధనుష్, ఐశ్యర్య వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిప్రాయభేదాలు కారణంగా 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్​పై త్వరలో విచారణ జరగనుంది.

click me!