అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద ఇంకా ఈ మూవీ కలెక్షన్ల వరద తగ్గలేదు. డీజే టిల్లు ని మించేలా టిల్లు స్క్వేర్ చిత్రం అభిమానులకు నచ్చేసింది. దీనితో చిత్ర యూనిట్ నేడు గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.