మరోసారి బయటపడ్డ విబేధాలు... అల్లు అర్జున్ - రామ్ చరణ్ మధ్య ఏం జరుగుతుంది?

Published : Apr 09, 2024, 07:04 AM IST

అల్లు అర్జున్ - రామ్ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన ఉంది. అది మరోసారి బయటపడింది. వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయాన్ని ధృవీకరించేలా తాజా పరిణామం ఉంది.  అల్లు - కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయనే వాదన చాలా కాలంగా ఉంది.  

PREV
16
మరోసారి బయటపడ్డ విబేధాలు... అల్లు అర్జున్ - రామ్ చరణ్ మధ్య ఏం జరుగుతుంది?
Allu Arjun Ram Charan

 ఈ విషయంపై అల్లు అరవింద్, చిరంజీవి సైతం స్పందించారు. అల్లు అరవింద్ ఇవన్నీ పుకార్లని కొట్టి పారేయగా...  రోజూ కలవడం కుదరదు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. సందర్భం వచ్చినప్పుడు కలుస్తూనే ఉంటాము... అని చిరంజీవి అన్నారు. 

26

అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రవర్తన అనుమానాలకు తావిస్తోంది. వీరిద్దరూ స్టార్డం లో పోటీపడుతున్నారు. అల్లు అర్జున్ మెగా హీరో ట్యాగ్ వదిలించుకోవాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ అని సపరేట్ ఫ్యాన్ బేస్ మంటైన్ చేస్తున్నాడు. 

 

36

అల్లు అర్జున్ తో రామ్ చరణ్ అంటీ ముట్టనట్లు ఉంటున్నాడు. తాజాగా వీరి మధ్య కోల్డ్ వార్ బయటపడింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో రామ్ చరణ్ విష్ చేయలేదు. 

46

అదే రోజు అక్కినేని అఖిల్ బర్త్ డే. ఆయనకు రామ్ చరణ్ ప్రత్యకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. డియర్ అఖిల్ అంటూ ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నొచ్చుకునేలా చేసింది. దాంతో ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. 


 

56

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకరిని మరొకరు ట్రోల్ చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. అఖిల్ తో పాటు ఉన్న ఫోటో షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్... అల్లు అర్జున్ కి పొడిపొడిగా రెండు పదాలతో విష్ చేశాడు. 

66

అయితే మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ - రామ్ చరణ్ మధ్య గొడవలు ఉన్నాయనే వాదనను కొట్టి పారేస్తున్నారు. అల్లు అర్జున్ బంధువు కాబట్టి రామ్ చరణ్ నేరుగా కలిసి లేదా కాల్ చేసి విష్ చేసి ఉండవచ్చు. సోషల్ మీడియా వేదికగా చెప్పనంత మాత్రాన విబేధాలు ఉన్నాయని చెప్పలేం అంటున్నారు. ఈ అనుమానాలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. 


 

Read more Photos on
click me!

Recommended Stories