వర్షను బ్లాక్ మెయిల్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్... అమ్మాయిలకు ఆఫర్ కావాలంటే చెప్పినట్లు వినాల్సిందే!

First Published | Aug 8, 2024, 3:57 PM IST

జబర్దస్త్ లో కొనసాగాలంటే టీమ్ లీడర్స్ చెప్పినట్లు వినాల్సిందేనా. వర్షను ఓ కమెడియన్ పబ్లిక్ గా బెదిరించడం అనుమానాలకు దారి తీసింది. 
 

అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది జబర్దస్త్ వర్ష. గతంలో ఆమె సీరియల్స్ లో నటించేది. అక్కడ ఎదుగు బొదుగు లేని జీవితమైపోయింది. దాంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. జబర్దస్త్ లో అతికొద్ది లేడీ కమెడియన్స్ ఉన్నారు. వారిలో వర్ష ఒకరు. 

గతంలో మగాళ్లు లేడీ గెటప్ లు వేసేవారు.  అబ్బాయిలను అమ్మాయిలుగా చూడలేక జబర్దస్త్ ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. దాంతో వర్ష లాంటి వాళ్ళకు డిమాండ్ ఏర్పడింది. తెల్లని మేను ఛాయ, చక్కని రూపం కలిగిన వర్షను బుల్లితెర ఆడియన్స్ ఆదరించారు. ఆమె కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. 


వర్ష ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపనీ షోలలో కొనసాగుతుంది. వర్ష పాపులర్ కావడానికి కమెడియన్ ఇమ్మానియేల్ కూడా ఒక కారణం. బుల్లితెర లవ్ బర్డ్స్ గా వీరు ఫేమ్ తెచ్చుకున్నారు. ఇమ్మానియేల్ అంటే వర్షకు చాలా ఇష్టం. తనకు దొరికిన అదృష్టం ఇమ్మానియేల్ అని పలుమార్లు చెప్పింది. వీరిద్దరికీ ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. సుడిగాలి సుధీర్-రష్మీ తర్వాత ఆ రేంజ్ లో వీరు క్రేజ్ తెచ్చుకున్నారు. 

ప్రస్తుతం ఇమ్మానియేల్ జబర్దస్త్ టీం లీడర్ గా ఉన్నాడు. వర్ష అతడి టీమ్ లోనే చేస్తుంది. తాజా ఎపిసోడ్ లో వర్షను ఇమ్మానియేల్ బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. తాను చెప్పినట్లు వినకపోతే నెక్స్ట్ స్కిట్ లో నీకు ఛాన్స్ ఉండదని ఓపెన్ గా చెప్పాడు. జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని అందరికీ తెలుసు. గతంలో కొందరు కమెడియన్స్ దీనిపై ఓపెన్ అయ్యారు కూడాను. 

Varsha

జబర్దస్త్ లో కొనసాగాలి అంటే టీమ్ లీడర్స్ చెప్పినట్లు వినాల్సిందే అని తాజా ఘటనతో రుజువైంది. ఇమ్మానియేల్ వర్షను బ్లాక్ మెయిల్ చేయడం చూస్తే అది కామెడీ అనిపించలేదు. అయితే జబర్దస్త్ కి ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి స్టార్ కమెడియన్స్ వెళ్ళిపోయాక కళ తప్పింది. గొప్పగా నవ్వించే కమెడియన్స్ ప్రస్తుతం లేరు. 
 

Latest Videos

click me!