నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంత..? వీరి ప్రేమ ఎక్కడ మొదలయ్యిందో తెలుసా..?

ఎట్టకేలకు అసలు నిజంతెలిసింది. ఇన్నాళ్లు ఉన్న అనుమానాలు నిజమే అనిచెపుతూ.. నాగచైతన్య ‌‌- శోభిత ధూళిపాళ ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. అయితే వీరిద్దరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయ్యింది..? వీరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది..? 

చాలా కాలంగా రహస్య ప్రేమ కొనసాగిస్తున్నారు నవయువ సాంమ్రాట్ అక్కినేని నాగచైతన్య  ‌- శోభిత ధూళిపాళ. ఎట్టకేళకు వీరి ప్రేమ వ్యవహారం బయటకువచ్చింది. ఏకంగా ఏంగేజ్మెంట్ వరకూ వెళ్ళింది. ఈరోజు (08 అగస్ట్) కింగ్ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఏంగేజ్మెంట్ ను జరుపుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కాగా వీరి ప్రేమ గురించి సోషల్ మీడియా మొదటి నుంచి కోడై కూస్తోంది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఓ సారి చైతూ ప్లాట్ ముందు.. శోభిత కారు అర్ధ రాత్రి ఉండటంతో అప్పటి నుంచి అనుమానం స్టార్ట్అయ్యింది. ఆతరువాత ఫారెన్ టూర్లలో వీరి ఫోటోలు బయటకు రావడం.. కలిసి ఉన్నపిక్స్ వైరల్ అవ్వడంతో.. వీరు డేటింగ్ లో ఉన్నరని ప్రచారానికి బలం చేకూరినట్టు అయ్యింది. ఆతరువాత కూడా వీరు అసలు విషయాన్నివెల్లడించలేదు. ఇక తాజాగా వీరి ఎంగేజ్ మెంట్ తో అందరికి క్లారిటీ వచ్చింది. 
 


అసలు వీరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలుసా..? నాగచైతన్య సమంతకు మధ్య విభేదాలు వచ్చి.. విడిపోయి విడాకులు తీసుకున్న తరువాత.. ఎవరికి వారు కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అయితే అదే సమయంలో చైతుకు..శోభితకు కామన్ గా ఉన్న ఓఫ్రెండ్ బర్త్ డేలో వీరు కలిసినట్టు నెట్టింట పెద్ద చర్చ జరిగింది. ఆ బర్త్ డేలోనే వీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. ఒకరిగురించిమరొకరు మాట్లాడుకోవడం.. తెలుసుకోవడంతో పాటు.. ఆరోజునుంచే కలిసి తిరగడం కూడా స్టార్ట్ చేశారని టాక్ బలంగా వినిపించింది. ఇక ఆతరువాత బాగా దగ్గరయిన వీరు.. లైఫ్ లో కూడా కలిసి నడవాలని నిర్ణయించుకన్నట్టు సమాచారం. 

ఇక ఈ విషయంలో సోషల్ మీడియా నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కూడా చర్చ జరుగుతోంది. అయితే వీరి మధ్య ఏజ్ గ్యాప్ 6 ఏళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది.  నాగచైతన్య.. నాగార్జున మొదటి భార్య..రామానాయుడు కూతురు లక్ష్మీ సంతానం కాగా.. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి.. తెనాలి అమ్మాయి కావడం విశేషం. 
 

వేణుగోపాలరావు – శాంత దంపతుల కుమార్తె  శోభిత జన్మించింది. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ – విశాఖ వ్యాలీ స్కూల్ లో  ఆమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ – ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డాన్స్ లో ఆమె కూచిపూడి, భరత నాట్యం రెండు నేర్చుకుంది.. ఆతరువాత  2013 ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది.

2016లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె..  అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ సినిమాలో  నటించింది. 2018 లో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శోభిత... అడివి శేష్ జంటగా గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి హిట్లు కొట్టింది. ఇక మణిరత్నం ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వమ్ లో కూడా శోభిత నటించింది. 

Latest Videos

click me!