`లాల్‌ సలామ్‌` మూవీలో ఎక్కడ మిస్టేక్‌ జరిగింది?.. రజనీకి కూతురు మళ్లీ దెబ్బేసిందా?

First Published | Feb 10, 2024, 11:45 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. `లాల్‌ సలామ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీకి తెలుగులో పెద్దగా ఆదరణ లేదు. మరి దీనికి కారణమేంటి? జరిగిన మిస్టేక్‌ ఏంటనేది చూస్తే..
 

`జైలర్‌` చిత్రంతో కెరీర్‌ బెస్ట్ కలెక్షన్లు సాధించారు రజనీకాంత్‌. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా నిలిచారు. ఆ సినిమా స్టోరీ, ఎలివేషన్లు, దర్శకుడి టేకింగ్‌ వాహ్‌ అనిపించింది. అలాంటి భారీ హిట్‌ తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తోన్న మూవీ అంటే అదే స్థాయి అంచనాలుంటాయి. హైప్‌ ఉంటుంది. కానీ తాజాగా వచ్చిన `లాల్‌ సలామ్‌`పై మాత్రం ఆ అంచనాలు లేవు, హైప్‌ లేవు. థియేటర్లోకి వచ్చాక ఆదరణ కూడా లేదు. కారణం ఏంటి? ఎక్కడ మిస్టేక్‌ జరిగింది అనేది చూస్తే..

మొదటగా ఈ మూవీకి దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్‌ కావడం ఓ కారణం. ఎందుకంటే ఆమె రూపొందించిన గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించింది తక్కువ.  `3`, `వెయ్‌ రాజా వెయ్‌` చిత్రాలు పెద్దగా ఆడలేదు. మరోవైపు మరో కూతురు సౌందర్య రజనీకాంత్‌ చేసిన `కొచ్చడయాన్‌` సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఐశ్వర్య కోసం తన ఇమేజ్‌ని పాణంగా పెట్టాడు రజనీ. 
 


ఐశ్వర్య ఇప్పుడు తండ్రి రజనీని పెట్టుకుని మరో ప్రయత్నం చేసింది. `లాల్‌ సలామ్‌` అనే మూవీ చేసింది. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకుల కుట్రలను వెలికితీసేలా కథతో ఈ మూవీ చేసింది. కంటెంట్‌ పరంగా ఇది ఔట్‌డెటెడ్‌ అయినా, ప్రస్తుతం దేశంలో అలాంటి రాజకీయాలే నడుస్తున్నాయి కాబట్టి కనెక్ట్ అవుతుంది. కాకపోతే ట్రెండీగా, కనెక్ట్ అయ్యేలా తీయాలి. లేదంటే బెడిసి కొడుతుంది. 
 

`లాల్‌ సలామ్‌` విషయంలో అదే జరిగింది. మిస్‌ ఫైర్‌లా మారింది. 1993 బ్యాక్‌ డ్రాప్‌ కథని ఎంచుకుని క్రికెట్‌ చుట్టూ, రథం చుట్టూ తిప్పి అసలు విషయం పక్కదారి పట్టేలా చేసింది. కథని, కథనాన్ని సరిగ్గా డీల్‌ చేయలేకపోయింది దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్‌. స్లో నెరేషన్‌, కథకి అడ్డం పడే సన్నివేశాలు ఆడియెన్స్ సహనంతో ఆడుకుంటాయి. పైగా రజనీకాంత్‌ వంటి స్టార్‌ని పెట్టుకుని ఏమీ చేయనివ్వకుండా కూర్చోవడానికే పరిమితం చేసింది. 
 

రజనీకాంత్‌ ఉన్నాడంటే ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఇందులో వీక్‌ చేసేసింది. దీంతో ఆయన్ని చూస్తుంటే ఆడియెన్స్ కి నిరసం వచ్చేస్తుంది. ముందుగా ఈ మూవీలో గెస్ట్ గా రజనీ చేస్తున్నారని అన్నారు. కానీ ఆయన్ని ఫుల్‌ లెన్త్ రోల్‌కి వాడేసుకున్నారు. అదే పెద్ద మైనస్‌. రజనీకాంత్‌ చేసిన మూవీ ఇలా ఉండటమేంటనే కామెంట్స్ వస్తున్నాయి. కూతురు డైరెక్టర్‌ కావడంతో రజనీ కూడా చేయడానికి ఏం లేదు, చేతులెత్తేసినట్టు ఆయన పాత్ర తీరుతెన్నులను చూస్తుంటే అర్థమవుతుంది.

పైగా హిందీ, ముస్లీంల మధ్య గొడవలు పెట్టడానికి సంబంధించిన ఎమోషన్స్ క్యారీ కాలేదు. కథలోని సోల్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ చేయలేకపోయింది. ఊర్లో ఘర్షణకు బలమైన కారణాలు చూపించలేదు. ఇది పెద్ద మైనస్‌. సినిమాలో డ్రామా పండలేరు. కోర్‌ పాయింట్‌ని సరిగ్గా చూపించలేకపోయారు. స్లో నెరేషన్‌ సైతం మైనస్‌గా చెప్పొచ్చు. మొత్తంగా `లాల్‌ సలామ్‌` తెలుగు ఆడియెన్స్ ని డిజప్పాయింట్‌ చేసిందని చెప్పొచ్చు. కాంటెంపరరీ ఇష్యూస్‌ తీసుకుని, అప్పటికీ, ఇప్పటికి ముడిపెడుతూ, మంచి ఎమోషన్స్, డ్రామా, యాక్షన్‌తో సినిమా చేస్తే ఫలితం వేరేలా ఉండేది. మొత్తంగా రజనీని మరోసారి కూడా సరిగ్గా వాడుకోలేకపోయింది ఐశ్వర్య. 

Read more: రజనీకాంత్‌ `లాల్‌ సలామ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..
 

click me!