కృష్ణం రాజు మరణవార్త విన్నాక సినీ తారలు ఆయన నివాసంలోని పార్థివ దేహాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, వడ్డే నవీన్, మురళీ మోహన్, నరేష్, మంచు విష్ణు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తదితరులు కృష్ణం రాజు పార్థిక దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.