బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్.. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..? ఎవరతను..?

First Published | Aug 30, 2024, 5:36 PM IST

డిస్క్రిప్షన్..      ఈసారి తెలుగు బిగ్సీ బాస్ సీజన్  8 కోసం అంతకు మించిన ప్లాన్ తో రాబోతున్నారు టీమ్. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి మాత్రం సర్ ప్రైజీంగ్ పర్సన్స్ ను హౌస్ లోకి తీసురాబోతున్నారు టీమ్. అతనో స్టార్ క్రియెటర్ అని సమాచారం.

తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ క్రికెటర్..?

ఎప్పటికప్పుడు కొత్త హంగులతో.. సీజన్ సీజన్ కు కొత్తదనం పులుముకుంటుంది బిగ్ బాస్ తెలుగు. ప్రతీసీజన్ కు ఆడియన్స్ కు అంతకు మించిన అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు టీమ్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ దగ్గర నుంచి.. టాస్క్ ల వలరకూ డిఫరెంట్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో ఎవరూ ఊహించని వ్యక్తులను హౌస్ లోకి తీసుకొచ్చి అభిమానులకు  సర్ ప్రైజ్ లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో బాగంగానే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఓ స్టార్ క్రికెటర్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా స్టార్ క్రికెటర్..? 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు  సీజన్ 7 లో ఎన్నో ప్రయోగాలు చేశారు.. సీజన్ 6దెబ్బ గట్టిగా కొట్టడంతో.. సీజన్ 7 లో మేజర్ మార్పులు చేశారు. అయితే ఇవి అందరిక నచ్చలేదు.. అలా అని సీజన్ 7 ప్లాప్ అవ్వలేదు. గత సీజన్ కంటే మంచి రెస్పాన్స్ నే సాధించింది. ఇక ఈసారి సీజన్ 8 కోసం అంతకు మించిన ప్లాన్ తో రాబోతున్నారు టీమ్.


ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి మాత్రం సర్ ప్రైజీంగ్ పర్సన్స్ ను హౌస్ లోకి తీసురాబోతున్నారు టీమ్. ఇక ఈ విషయంలో ఇప్పటికే ఎవరెవరు అనేది లిస్ట్ కూడా ఫిక్స అయ్యిందట.  

Ambati Rayudu

ఇక ఈ లిస్ట్ లో తాజాగా స్టార్ క్రికెటర్ అంబరి రాయుడు పేరు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. క్రికెట్ ప్రియులను కూడా బిగ్ బాస్ వైపు తిప్పుకునే విధంగా.. తెలుగు స్టార్ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ ను ఈ సీజన్  తీసుకున్నారట. కాస్త కాట్లీ అయినా.. క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు.. అంబటి ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ వైపు మళ్ళే విధంగా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ 8 టీమ్ గట్టి  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ambati Rayudu quits YSRCP

ఇక ఇతను ఒకప్పుడు స్టర్ క్రికెటర్ మాత్రమే కాదు..ప్రస్తుతం పొలిటీషియన్ కూడా.. క్రికెట్‌ కెరీర్ కు కంప్లీట్‌గా గుడ్ బై చెప్పి రాయుడు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట వైసీపీలో చేరి వారం  తిరగకుండానే.. ఆ పార్టీకి రిజైన్ చేసి.. గుడ్ బై చెప్పాడు. ఇక ఆ  తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన అంబటి.. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో  జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా  ఉన్నాడు. 

Bigg Boss Telugu

ఇక అంబటి రాయుడిని బిగ్ బాస్ కోసం సెలక్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన ఆటలో చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటాడు.. అంతే కాదు బయట కూడా ఆయన ముక్కుసూటితనంతో పాటు.. ముఖం మీద చెప్పే అలవాటు ఉండటం.. హౌస్ లో రాయుడితో చాలా స్టఫ్ ను క్రియేట్ చేయవచ్చు అనుకున్నారట టీమ్. 
 

Bigg Boss Telugu 8

అంతే కాదు ఇప్పటి వరకూ బిగ్ బాస హౌస్ లోకి క్రికెటర్లు ఎవరు రాలేదు. అన్ని రంగాల నుంచి తీసుకుంటున్నారు కదా.. స్పోర్ట్స్ పర్సన్ వస్తే.. అది కూడా రాయుడు లాంటి అగ్రెసీవ్ మెంబర్ హౌస్ లో ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా మారుతుంది అని భావించారట టీమ్.  అందుకే అంబటిని భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసి మరీ..హౌస్ లోకి వెల్కం చెప్పినట్టు సమాచారం. చూడాలి బిగ్ బాస్ పాచికలు ఎంత వరకూ ఫలిస్తాయో. 

Latest Videos

click me!