కియారా అద్వానీ కి ఏమైంది..? హాస్పిటల్ లో గేమ్ ఛేంజర్ హీరోయిన్

First Published | Jan 4, 2025, 6:06 PM IST

కియారా అద్వానికి ఏమయ్యింది..? గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో ఎందుకు కనిపించడంలేదు..? ఆమె హాస్పిటల్ జాయిన్ అయ్యిందా..? కారణం ఏంటి..? 

మెగా హీరో రామ్ చరణ్ , కియారా అద్వాని కాంబినేషన్లో తెరక్కిన సినిమా గేమ్ ఛేంజర్. సౌత్ ఇండియాన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్టెజ్ మూవీ  సంక్రాంతి కానుకగా.. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున  రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో ఈమూవీ ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు టీమ్.

ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో  ఈవెంట్లు చేసుకుని ఇండియాకు వచ్చిన గేమ్ ఛేంజర్ టీమ్.. ఇక్కడ కూడా దేశ వ్యాప్తంగా ఈవెంట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ను నిర్వహించారు. రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈసినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. 
 

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటి వరకూజరుగుతున్న ప్రమోషన్ ఈవెంట్ లో ఈసినిమాలో నటించిన  SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి .. స్టార్స్ అంతా హాజరవుతున్నారు. కాని గేమ్ ఛేంజర్ హీరోయిన్  కియారా అద్వానీ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. 
 


ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అంజలి దాదాపు అన్ని ప్రమోషన్స్ లో  రెగ్యులర్ గా పాల్గొంటుంది కానీ కియారా అద్వానీ మాత్రం ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో తప్ప ఇప్పటి వరకు ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడలేదు. నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కి కూడా కియారా హాజరవకపోవడంతో అసలుఏం జరిగింది అంటూ చర్చ మొదలయ్యింది. 
 

Game Changer

కొన్ని కొన్ని సందర్భాల్లో అలా కనిపించి మాయం అవుతుంది తప్పించి ఫుల్ గా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో ఈమె కనిపించడంలేదు. కియారాతోకలిసి ప్రమోషన్స్ చేయండంటూ.. కొంత మంది అభిమానులు కోరుతున్నారు. బాలీవుడ్ లో  జరిగే ప్రమోషన్స్ లో కియారా అద్వాని లేకుంటే సినిమాకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాకపోయినా.. బాలీవుడ్ ప్రమోషన్స్ లో ఆమెకనపడే అవకాశం ఉందని  అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉందట కియారా.. కాస్త కోలుకున్నాక నార్త్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. 
 

game changer movie music budget shankar ram charan

బాలీవుడ్ లో కొన్ని మీడియాలో కియారా హాస్పిటల్లో ఉందంటూ ప్రచారం చేయడంతో... కియారా మేనేజర్ ఈ విషయంలో స్పందించినట్టు తెలుస్తోంది.  కియారాకు ఏం కాలేదని..  హాస్పిటల్ లో అడ్మిట్ కాలేదని చెప్పినట్టు సమాచారం. ఆమె విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొద్దిగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. అందుకే ఇవాళ ముంబై ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. దీంతో సాయంత్రం జరిగే గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి కూడా కియారా రాదనే తెలుస్తుంది. మరి  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తుండటంతో ఈ ఈవెంట్లో అయినా ఆమె కనిపిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

click me!