రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ రీతూ చౌదరి, ఆమె భర్త ఎవరో తెలుసా..మామూలోడు కాదు ఇరికించేశాడు

First Published | Jan 4, 2025, 5:39 PM IST

బుల్లితెరపై చాలా షోలలో రీతూ చౌదరి కనిపిస్తోంది. జబర్దస్త్ తో ప్రారంభమైన ఆమె కెరీర్ ఇప్పుడు కొన్ని టివి కార్యక్రమాలు చేసేవరకు చేరుకుంది. అలాంటి రీతూ చౌదరి  పేరుపై ఏకంగా 700 కోట్ల భారీ ల్యాండ్ స్కామ్ బయటకి వస్తుందని ఎవరైనా ఊహించగలరా ?

జబర్దస్త్ రీతూ చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. జబర్డస్త్ షోతో గుర్తింపు పొందిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ ప్రదర్శిస్తూ యువతలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంది. బుల్లితెరపై చాలా షోలలో రీతూ చౌదరి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ ప్రదర్శన అంతా ఇంతా కాదు. జబర్దస్త్ తో ప్రారంభమైన ఆమె కెరీర్ ఇప్పుడు కొన్ని టివి కార్యక్రమాలు చేసేవరకు చేరుకుంది. 

అలాంటి రీతూ చౌదరి  పేరుపై ఏకంగా 700 కోట్ల భారీ ల్యాండ్ స్కామ్ బయటకి వస్తుందని ఎవరైనా ఊహించగలరా ? అసలు ఆమె ఆస్తులు కోట్లల్లో అయినా ఉంటాయి అని కూడా ఎవరూ అనుకోరు. ఎందుకంటే టివికి మాత్రమే పరిమితమైన నటీనటుల పారితోషికం ఆ రేంజ్ లో ఉండదు. కానీ ఏపీలో సంచలనం సృష్టిస్తున్న 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతూ చౌదరి పేరు వినిపిస్తోంది. అంతే కాదు ఆమెకి ఆల్రెడీ వివాహం జరిగినట్లు కూడా ఈ స్కామ్ ద్వారా బయటపడింది. 


గతంలో రీతూ చౌదరికి వివాహం జరిగినట్లు కూడా ఈ స్కామ్ ద్వారా బయట పడింది. ఏపీలో 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో భాగం అయిన చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరికి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య రీతూ చౌదరి పేరు మీద వందల కోట్ల విలువైన భూములని శ్రీకాంత్ రిజిస్టర్ చేయించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ భార్యగా రీతూ చౌదరి ఫోటో, ఆమె సంతకం, వేలు ముద్ర డాక్యుమెంట్స్ లో కనిపిస్తున్నాయి. 

రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ అనే వ్యక్తి ఏపీలో భారీ ల్యాండ్ స్కామ్ జరిగింది అని దానిపై విచారణ జరిపించాలని అని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. అక్కడి నుంచే ఈ స్కామ్ బయట పడ్డట్లు తెలుస్తోంది. చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి వైసీపీ నేతలకు బినామీ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం భూములు తన పేరు పైనే ఉంటే ప్రమాదం కాబట్టి కొన్ని భూములని అతడి రీతూ చౌదరి పేరుపై రిజిస్టర్ చేయించారట. 

ఈ స్కామ్ గురించి రీతూ చౌదరి తాజాగా స్పందించింది. శ్రీకాంత్ నుంచి తాను ఏడాదిగా దూరంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పుడు అతడితో నాకు సంబంధం లేదు. నేను ఏదో నా బతుకు నేను బతుకుతున్నా. అతడు నాకు వద్దు అని కోర్టులో చెప్పేశా. ప్రస్తుతం మా ఇద్దరి రిలేషన్ గురించి కోర్టులో కేసు ఉంది. అతడితో నాకు సంబంధం లేదు. రిలేషన్ లో ఉన్నప్పుడు సంతకం పెట్టమంటే పెట్టాను. కోట్ల విలువ చేసే భూముల గురించి నాకు తెలియదు. నాకు తెలియని అంశం, తెలియని వివాదంలో నన్ను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు అంటూ రీతూ చౌదరి వాపోయింది. 

Also Read : రాంచరణ్ ని తొలిసారి టీవీలో చూసిన క్లీంకార, ఆ పాత్రలో కనిపించగానే రియాక్షన్ చూడండి.. గూస్ బంప్స్

రీతూ చౌదరి చెబుతున్నట్లు ఆ ల్యాండ్ వివాదం గురించి ఆమెకి అసలు అవగాహన లేదా.. ఆమె భర్తగా చెప్పబడుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ఆమెని ఇరికించేశాడా ? ఇప్పుడు ఈ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. మొత్తంగా ఈ వివాదంలో పెద్ద పెద్ద తలకాయల పేర్లు వినిపించడం సంచలంగా మారింది. 

Latest Videos

click me!