చిత్ర పరిశ్రమలో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. అదే విధంగా నటీనటులకు, దర్శకులకు, నిర్మాతలకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. తమ విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొన్ని సంచలన పుకార్లు వినిపించాయి. చంద్రముఖి చిత్రం తర్వాత ఈ పుకార్లు వ్యాపించాయి.