రాజమౌళికి, నాగ్‌ అశ్విన్‌కి ఉన్న తేడా అదే?.. `కల్కి 2898ఏడీ`లో విషయంలో జరిగిన మిస్టేక్‌ ఏంటంటే?

First Published Jun 29, 2024, 7:41 AM IST

`కల్కి 2898ఏడీ` చిత్రంతో నాగ్ అశ్విన్‌.. రాజమౌళిని దాటేశాడా? దర్శకులుగా  జక్కన్నకి నాగ్‌కి మధ్య ఉన్న తేడా ఏంటి? నాగ్‌ ఏం మిస్‌ అయ్యాడు?
 

`కల్కి 2898ఏడీ` సినిమా వచ్చి థియేటర్లలో సందడి చేస్తుంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. జనం బ్రహ్మరథం పడుతున్నారు. అయితే సినిమా విషయంలో కొంత నెగటివిటీ కూడా ఉంది. క్లైమాక్స్ తప్ప మిగిలినదంతా సోదిగా ఉందని అంటున్నారు. టెక్నీకల్‌గా బాగున్నా, కథ పరంగా ఏం లేకపోవడం, బాగా సాగదీసినట్టుగా ఉండటంతో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. 
 

ఈ నేపథ్యంలో కంపేరిజన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా `బాహుబలి 2` నిలిచిన విషయం తెలిసింది. 1800కోట్లతో టాప్‌లో ఉంది. దాన్ని కొట్టడం `కల్కి`కి సాధ్యం కాదని విశ్లేషకులు, ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఈ సినిమా వీకెండ్స్ తర్వాత డల్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లాంగ్‌ రన్‌ కష్టమనే అభిప్రాయం వినిపిస్తుంది. 

`కల్కి 2898ఏడీ` టెక్నీకల్ గా బాగుంది. వీఎఫ్‌ఎక్స్ అదిరిపోయాయి. నాగ్‌ అశ్విన్‌ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేయడంతోపాటు దాన్ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ఆ వాహనాలు, ఆ లొకేషన్స్, విజువల్స్ వాహ్‌ అనేలా ఉన్నాయి. క్లైమాక్స్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఎప్పుడూ చూడని కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేయడంతో ఆడియెన్స్ కొత్త అనుభూతిని పొందుతున్నారు తప్పితే, సినిమాగా, కథ పరంగా సినిమాతో ట్రావెల్‌ కాలేకపోతున్నారు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. దీనికి కారణం ఎమోషన్స్ పండకపోవడమే. సినిమా ఏదైనా ఒక ఎమోషన్ ప్రారంభం నుంచి ట్రావెల్‌ అవుతుంది. కథనంలో అంతర్లీనంగా జర్నీ చేస్తుంది. అదే ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే తెలియకుండానే కథతో ట్రావెల్‌ అవుతారు. కానీ `కల్కి` విషయంలో అది లోపించింది. 
 

ఈ విసయంలో రాజమౌళికి, నాగ్‌ అశ్విన్‌ కి ఉన్న తేడా అదే. రాజమౌళి సినిమాలో విజువల్స్, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఫన్‌ ఇలా అన్ని సమపాళ్లలో ఉంటాయి. అంతకు మించిన ఒక ఎమోషన్‌ ఉంటుంది. ఫస్ట్ సీన్‌లోనే దాన్ని చూపిస్తాడు. ప్రేమగానీ, బాధగానీ, ఒక సెంటిమెంట్‌ గానీ బలంగా చూపిస్తాడు. దానితో ఆడియెన్స్ ట్రావెల్‌ అవుతారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో చైల్డ్ ఎమోషన్‌ మెయిన్‌. ఎన్టీఆర్‌ పాత్రలో అ అమ్మాయి ఎమోషన్‌ ఉంటుంది. రామ్‌ చరణ్‌ పాత్రలో తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం, తన ప్రాంతానికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం తాన పడే బాధ ఆయా పాత్రల్లో కనిపిస్తుంది. `బాహుబలి`లోనూ రాజ్యం కోసం పోరాటం, మోసం చేసిన బళ్లాలదేవపై ప్రతీకారం కోసం వెయిట్‌ చేయడం ప్రభాస్‌, కట్టప్ప, అనుష్క పాత్రల్లో కనిపిస్తుంది. జక్కన్న ప్రధాన బలమే ఎమోషన్స్ ని బలంగా చూపించడం, దాన్ని సినిమా మొత్తం ట్రావెల్‌ అయ్యేలా చేయడం. అందుకే ఆయన సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతుంటారు. 
 

nag ashwin

కానీ నాగ్‌ అశ్విన్‌ దాన్ని పట్టుకోలేకపోయాడు. తడబాటుకు గురయ్యాడు. నిజానికి తాను ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా సంక్లిస్టమైనది. మహాభారతానికి భవిష్యత్‌కి ముడిపెట్టడం అనేది పెద్ద టాస్క్. కన్విన్సింగ్‌గా చెప్పాలి. ట్రూత్‌కి స్కోప్‌ ఉండాలి, ఫిక్షన్‌ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్‌ దర్శకుడికి. ఈ విషయంలో నాగ్‌ సక్సెస్‌ అయ్యాడు. కానీ ఎమోషన్స్ ని పట్టుకోవడంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయాడు. కాశీలోని జనం పడే బాధలను బలంగా చూపించలేదు. అలాగే రెబెల్స్ ఎందుకు పోరాడుతున్నారు? వాళ్లు ఎందుకు అలా మారారు అనేది చూపించలేదు. సుప్రీం ఎలాంటి బాధలుపెడుతున్నాడనేది బలంగా ఆవిష్కరించలేకపోయారు. దీపికా పదుకొనె పాత్రలోనూ ఎమోషన్‌ పండలేదు. అశ్వత్థామ పాత్రలోనూ ఎమోషన్‌ బలంగా క్యారీ కాలేదు. 

అందుకే చాలా వరకు ఆడియెన్స్ డిస్‌ కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ లో మహాభారతం ఎలిమెంట్లు ఉండటంతో వాటిని ఎంజాయ్‌ చేస్తున్నారు, ఆ ఎలిమెంట్లే లేకపోతే ఈ సినిమా సాధారణ మూవీగానే నిలిచిపోయేది. ఈ విషయంలో నాగ్‌ మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. రాజమౌళి తరహాలోనే ఎమోషన్స్ పై పట్టు సాధించి, వాటిని అంతే ఎఫెక్టివ్‌గా తెరపై ఆవిష్కరిస్తే `నాగ్‌ని కొట్టే మొగాడు(దర్శకుడు) పుట్టలేదు మామా` అనే డైలాగ్‌ రాసిపెట్టుకోవచ్చు. ఆయన రెండో పార్ట్ విషయంలో అయినా దానిపై దృష్టిసారిస్తారేమో చూడాలి. 
 

nag ashwin

ఇక ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898ఏడీ` చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్‌, ఫరియా, శోభన వంటి వారు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. గురువారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 191కోట్లు కలెక్ట్ చేసింది. 

Latest Videos

click me!