“దేవర” హిందీ టాక్ ఏంటి, అక్కడవాళ్లు ఏమంటున్నారు

First Published | Sep 11, 2024, 2:41 PM IST

సెప్టెంబర్ 27, 2024  న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ట్రైలర్   ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ చేసి లాంచ్ చేసారు. 


 
 ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం  దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా యావత్ దేశం ఎదురుచూస్తోందన్న సంగతి తెలిసిందే.   ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో .. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

సెప్టెంబర్ 27, 2024  న రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ట్రైలర్   ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ చేసి లాంచ్ చేసారు. అలాగే అక్కడ ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దేవర ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ వాళ్లు ఏమంటున్నారు అనేది అక్కడ వెబ్ మీడియా రివ్యూలు, సోషల్ మీడియా కామెంట్స్ ని బట్టి అంచనా వేస్తే కొన్ని విషయాలు రివీల్ అయ్యాయి. 
 


దేవర ట్రైలర్ ని చూస్తే బాగానే  ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని అంటున్నారు అభిమానులు. ట్రైలర్‌ను చూస్తుంటే సముద్రం నేపధ్యంలో జరిగే కథగా అర్థం అవుతోంది. తండ్రి , కోడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు.

తండ్రి ఎన్టీఆర్ చనిపోతే, ఆయన స్థానంలో కొడుకు ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని ట్రైలర్‌ను చూస్తే అర్దమవుతోంది. తండ్రి ఎన్టీఆర్ చాలా సాహసమైన వాడు కాగా, ఇప్పుటి రెండో ఎన్టీఆర్ పిరికివాడిగా కనపడతాడు. అయితే అలా నటిస్తాడా నిజంగానే పిరికివాడా అనేది తెలియాల్సి ఉంది. అలాగే  విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కథలో ఆయన లెగ్త్ ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునే ఉంది.  ఇది మన తెలుగు వాళ్లు ట్రైలర్ గురించి చెప్తున్న మాటలు. 



అయితే నార్త్ బెల్ట్ లో ఎన్టీఆర్ ..తన ఆర్.ఆర్.ఆర్ చిత్రంతోనే పాపులర్ అయ్యారు. ఆ సినిమా ఆయన సోలో చిత్రం కాదు. దాంతో ఎన్టీఆర్ ఇప్పుడు వారికి కొత్తవాడే. కంటెంట్ అద్బుతంగా ఉంటేనే అక్కడవారికి నచ్చుతారు.   దాంతో ఈ ట్రైల‌ర్ బాగా నిరుత్సాహ ప‌ర్చిందని కామెంట్స్ చేస్తున్నారు.  

కొరటాల శివ (Koratala Siva) కేజీఎఫ్ పార్మాట్ లో ఈ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ అది ఆచార్యలానే అయిందనిపిస్తూందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలోని సీన్స్ లను, దేవర (Devara Part 1) ట్రైలర్‌లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చెస్తూ ఉన్నారు.

Devara Part 1

 ట్రైలర్ చివర్లో షార్క్ పైన ఎన్టీఆర్ నీళ్లలోంచి పైకి రావటం, ఆ షార్క్ ని కొరడాతో అదలించటం, అలాగే రెండేళ్లు పాటు దేవర  సముద్ర నీళ్లలోనే ఉన్నాడని చెప్పటం ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే 300 కోట్ల సినిమాకు తగ్గ  VFX  వర్క్ లేదంటున్నారు. CGI,VFX , లైటింగ్ మీద చాలా విమర్శ నడుస్తోంది.

సోషల్ మీడియాలో రియాక్షన్స్ చాలా మిక్సెడ్ గా కనపడుతున్నాయి. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ చూసాము కానీ మరీ ఇలా షార్క్ సీన్ అంత చిత్రమైనవి చూడలేదంటున్నారు. అయితే అందరూ విమర్శ చేస్తున్నారని కాదు. కొందరు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు.

junior ntr movie devara trailer


అయితే సినిమా రిలీజ్ అయ్యాక చాలా విషయాలు జనం మర్చిపోతారు. సినిమా కథలో భాగంగా ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు క్యాజువల్ గా ఉండే అవకాసం ఉందనేది నిజం. కాబట్టి ట్రైలర్ చూసి ఓ అంచనాకు వచ్చేయటం మాత్రం దారుణమే. హిందీ మార్కెట్ లో మంచి ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ ముందుకు వెళ్తున్నారు. అవి సక్సెస్ అయితే అదిరిపోయే ఓపినింగ్స్ ఉంటాయనేది నిజం.  
 

Devara Trailer

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్  పాయింట్.  
 

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు.

అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు.  రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos

click me!