బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లో ప్రేరణ కంబం ఒకరు. ఈ కన్నడ సీరియల్ నటి తెలుగులో కూడా పాపులర్. హైదరాబాద్ లో పుట్టిన ప్రేరణ, పెరిగింది మాత్రం బెంగుళూరులో. అక్కడే మోడలింగ్ స్టార్ట్ చేసింది. 2017లో ఆమె బుల్లి తెరకు పరిచయమయ్యారు. హర హర మహదేవ ఆమె డెబ్యూ సీరియల్. మరొక కన్నడ సీరియల్ రంగనాయకి తో పాపులారిటీ రాబట్టింది.
2018లో సురకత్తె టైటిల్ తో విడుదలైన కన్నడ చిత్రంలో నటించింది. ఫిజిక్స్ టీచర్ అనే మరో చిత్రంలో ప్రేరణ ప్రధాన పాత్ర చేసింది. తెలుగులో కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చింది. కృష్ణ పాత్రలో ఆమె మెప్పించారు. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు.