Keerthy Suresh, Raghu Thatha, OTT
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత . ఈ చిత్రం రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. కొత్త దర్శకుడు సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జీ5 ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ కలిగి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
Keerthy Suresh Raghu Thatha
ఆగస్టులో థియేటర్లలోరిలీజైన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్రయత్నించి ట్రైలర్ కూడా వదిలారు కానీ కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ తీసుకువస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ సినిమాతో తమిళ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది.
అంతే కాదు ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి బాలీవుడ్‌హిట్ వెబ్ సిరీస్‌లకు కథా రచయితగా పని చేసిన సుమన్ కుమార్ (Suman Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Keerthy Suresh Raghu Thatha
ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని జీ 5 తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు మరియు కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. రవీంద్ర విజయ్ (Ravindra Vijay), ఎమ్మెస్ భాస్కర్ (M. S. Bhaskar), సమి, దేవదర్శిణి (Devadarshini) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు
Raghu Thatha
కథ విషయానికి వస్తే.. 1970 నేపథ్యంలో నాడు హిందీ భాషను మహిళలపై బలవంతంగా రుద్దడంపై సెటైరిక్ పంచులు వేస్తూ కామెడీ టచ్‌తో ఈ సినిమాను రూపొందించారు. కాయల్ పాండియన్ ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకు పదోన్నతి వచ్చే క్రమంలో హిందీ భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలని సదరు బ్యాంకు షరతు పెడుతుంది.
దీంతో అప్పటికే బాగా ఫెమినిస్ట్ , రెబల్ లక్షణాలు ఉన్న కాయల్ ఆ షరతును వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో ఆమె లైఫ్‌లోకి సెల్వన్ అనే ఇంజినీర్ రాగా తన జీవితం మలుపు తిరుగుతుంది. సెల్వన్‌ను త్వరగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కాయల్ తిరిగి హిందీని ఎందుకు నేర్చుకోవాలనుకుంది, చివరకు నేర్చుకుందా లేదా, అసలు సెల్వన్ ఎవరనే ఆసక్తికరమైన కథకథనాతో సినిమా సాగుతుంది.
Keerthy Sureshs Raghu Thatha
సినిమా ఎలా ఉంటుందంటే..
ఇదో ఫీల్ గుడ్ ఫిల్మ్. సెటైరిక్ డైలాగులు, కీర్తి సురేశ్, రవీంద్ర విజయ్ నటన పై బేస్ చేసుకుని చేసిన సినిమా. దేవ దర్శిణి కామెడీ సినిమాకు హైలెట్ అవ్వగా సంగీతం కూడా బాగా కుదిరింది. 70లలో నాటి గ్రామాలు, ప్రజల తీరుతెన్నులను, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో పాటు వారికి విధించే ఆంక్షలను, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడా సెటైరికల్‌గా చూపించారు.
ఎలాంటి అసభ్యత, అశ్లీల సన్నివేశాలు లేవు ఇంటిల్లి పాది అంతా కలిసి ఈ రఘు తాత (Raghu Thatha) సినిమాను చూసి ఆస్వాదించవచ్చు అని నిర్మాతలు చెప్తున్నారు.