Bigg Boss 10 Elimination: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌, ఈ ఇద్దరు ఔట్‌.. నటరాజ్‌ మాస్టర్‌ అన్నట్టే అయ్యిందా?

Published : Nov 28, 2026, 05:02 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌.. 12 వ వారం ఎలిమినేషన్‌ విషయంలో క్లారిటీ వచ్చింది. మొదటగా వంశీ ఎలిమినేట్‌ అయ్యాడట. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరి రెండో ఎలిమినేషన్‌ ఎవరు?

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10.. 12వ వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10.. 12వ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందట. గత వారం సింగిల్‌ ఎలిమినేషన్‌ చేశారు. దీంతో ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ చేయబోతున్నారట. త్రిగుణ్‌, ముఖేష్‌, రామ్‌ ప్రసాద్‌, దేబ్జానీ, రామకృష్ణ, వంశీ, వర్షిణి ఈ వారం నామినేషన్‌లో ఉన్నారు.

వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారని ఇప్పటి వరకు సస్పెన్స్ గా, ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఓటింగ్‌ ప్రకారం త్రిగుణ్‌, ముఖేష్‌ టాప్‌లో ఉన్నారు. రాంప్రసాద్‌, రామకృష్ణ, దేబ్జానీ యావరేజ్‌ ఓటింగ్‌తో మిడిల్‌లో ఉన్నారు. ఇక డేంజర్‌లో ఉన్నది వంశీ, వర్షిణి. వీరిద్దరిలో ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అనుకున్నదే జరిగింది.

24
టెంపర్‌ వంశీ ఎలిమినేట్‌ ?

బిగ్‌ బాస్‌ తెలుగు 10 లో 12 వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన ప్రాసెస్‌ నడుస్తోంది. చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎలిమినేషన్‌ జరిగిందని సమాచారం. అందులో మొదటగా వంశీని ఎలిమినేట్‌ చేశారట.

ఆడియెన్స్ ఓటింగ్‌లో ఆయనకు తక్కువ ఓటింగ్ వచ్చిందని, దీంతో ఆయన్ని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం. సోషల్‌ మీడియాలో పలువురు బిగ్‌ బాస్‌ లవర్స్, ఈ షోని ఫాలో అయ్యేవాళ్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ వారం మొదటి ఎలిమినేషన్‌గా వంశీని ఇంటికి పంపించినట్టు చెబుతున్నారు.

34
డబుల్‌ ఎలిమినేషన్‌

ఇక ఈ వారం డబుల్‌ డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందట. మరో కంటెస్టెంట్‌ కూడా హౌజ్‌ని వీడబోతున్నట్టు సమాచారం. అందులో భాగంగా వర్షిణికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వంశీతోపాటు వర్షిణిని కూడా ఎలిమినేట్ కాబోతుందని, ఆమెకి సంబంధించిన విషయం డిసైడ్‌ అయ్యిందని, ఆ షూటింగ్‌ జరగాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో అనుకున్నట్టుగానే ఇద్దరు ఎలిమినేట్‌ అవుతున్నారు. అనుకున్న వాళ్లే ఎలిమినేట్‌ అవుతున్నారు.

మరి నిజంగానే డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందా? వంశీతోపాటు వర్షిణి ఎలిమినేట్‌ అవుతుందా. కేవలం వంశీకే పరిమితం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సోర్స్ ప్రకారం ప్రకారం ఈ ఇద్దరు ఎలిమినేట్‌ కాబోతున్నారని టాక్‌. అది కాకుండా చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం మాత్రం ఈ వారం ఈ ఇద్దరు హౌజ్‌ని వీడబోతున్నారని టాక్‌.

44
నటరాజ్‌ మాస్టర్‌ అనుకున్నట్టే అయ్యిందా?

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోపై మొన్న నటరాజ్‌ మాస్టర్‌ ఆరోపణలు చేయించారు. వంశీ దారుణమైన పదాలు వాడుతున్నాడని, మహిళలపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడని, తనపై కూడా కామెంట్‌ చేశాడని నీతూ మాస్టర్‌ కామెంట్‌ చేశారు.

ఈ క్రమంలో దీనిపై నటరాజ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ ఫైర్‌ అయ్యాడు. వంశీ రౌడీ అని, రియల్‌ రౌడీలా ప్రవర్తిస్తున్నాడని, మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆరోపించాడు. ఇలాంటి వాళ్లని బిగ్‌ బాస్‌ సేవ్‌ చేస్తున్నారని విమర్శించారు. వాళ్లని వెంటనే హౌజ్ నుంచి పంపించాలని కూడా చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు వంశీ ఎలిమినేట్‌ కావడం షాకిస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories