మేం తెలుగు వాళ్ళమంటూ..తొలిసారి వెల్లడించిన రాధిక, ఆంధ్రాలో రాధిక సొంత ఊరు ఎక్కడో తెలుసా..?

Published : Apr 20, 2022, 03:51 PM IST

90 దశకంలో హీరోయిన్ గా దడదడలాడించింది రాధిక. తమిళంతో పాటు తెలుగు తెరపై స్టార్ హీరోలతో కలిసి రాధిక అదరగొట్టారు. స్టార్ హీరోలను మించిన ఇమేజ్ తో దూసుకుపోయిన రాధిక, మెగాస్టార్ చిరంజీవితో కలిసి  ఎక్కువ సినిమాలు జోడీగా నటించారు రాధిక.   

PREV
16
మేం తెలుగు వాళ్ళమంటూ..తొలిసారి వెల్లడించిన రాధిక, ఆంధ్రాలో రాధిక సొంత ఊరు ఎక్కడో తెలుసా..?

వెండి తెరపై బుల్లి తెరపై తనదైన శైలి చూపించిన రాధిక, హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ అందుకున్నారో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే ఇమేజ్ సాధించారు. అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో అదరగోడుతున్నారు. 
 

26

 ఇక  సీనియర్ నటి రాధికా అంటే అందరూ తమిళ వ్యక్తి అనుకుంటారు. చెన్నై నుంచే ఇండస్ట్రీకి రావడం, తమిళంలో ఫేమస్ అయ్యాక తెలుగు లో కూడా స్టార్ డమ్ తెచ్చుకోవడం.. ఫ్యామిలీ మూలాలన్నీ తమిళంలోనే ఉండటంతో రాధికా పక్కా తమిళ్ అనుకుంటారు అంతా కాని ఆమె అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన వ్యాక్తి       

36

తాము తెలుగువాళ్లమేనని ఆమె రీసెంట్ గా స్పష్టం చేశారు. తమ సొంతూరు ఎక్కడో కూడా వెల్లడించారు.  తన తండ్రి ఎంఆర్ రాధా సొంతూరు తిరుపతికి సమీపంలోనే వుందని ఆమె అన్నారు. అంతే కాదు తన తండ్రి తెలుగు మాట్లాడేవారని   అయితే ది కొంచెం గమ్మత్తుగా ఉండే దన్నారు. 

46

రీసెంట్ గా ఓ టీవీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  అయితే తను తెలుగు అమ్మాయినని కోలీవుడ్ వారు అనుకుంటారని. తమిళంలో తనను తెలుగమ్మాయి అంటారని... తెలుగులో మాత్రం తనను తమిళ అమ్మాయి అంటారని రాధిక నవ్వుతూ అన్నారు.కెరీర్ బిగినింగ్ లో తనకు తెలుగు వచ్చేది కాదన్నారు రాధిక.  తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తరువాతే తాను తెలుగు నేర్చుకుని స్పస్టంగా మాట్లాడుతున్నా అన్నారు రాధిక. 

56

ఇక రాధిక తన ఫ్యామిలీ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తనకు ఇద్దరు అన్నదమ్ములు, చెల్లెలు ఉన్నారన్న రాధికా... అన్నదమ్ములిద్దరూ శ్రీలంకలో షిప్పింగ్ బిజినెస్ లో ఉన్నారని తెలిపారు. ఇక తన చెల్లెలు నిరోషా అందరికి తెలిసిందే.. ఆమె హీరోయిన్ గా చేసిందంటూ చెప్పుకొచ్చారు.  
 

66

ఇక రాధిక తెలుగు,తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ మద్యే రాధిక  శర్వానంద్ తో కలిసి నటించిన ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యింది. ఇక స్టార్ యంగ్ హీరోల సినిమాలలో వరుసగా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు సీనియర్ హీరయిన్. 

click me!

Recommended Stories