100 కే ‘కల్కి’టికెట్‌ ఆఫర్‌, నెక్ట్స్ టీమ్ తో కలిసి చేసే సర్పైజ్ ఆఫర్

Published : Aug 02, 2024, 07:37 AM IST

 కేవలం రూ. 100కే తమ సినిమాని చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. 

PREV
16
 100 కే ‘కల్కి’టికెట్‌ ఆఫర్‌, నెక్ట్స్ టీమ్ తో కలిసి చేసే సర్పైజ్ ఆఫర్
Kalki 2898 AD


 ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా జూన్‌ 27న బాక్సాఫీసు ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ గతనెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.1100 కోట్లు వసూళ్లు చేసింది.

26
Prabhas Kalki 2898 AD ott release update


ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి కలెక్షన్స్ పరంగా రికార్డ్ ల వర్షం కురిపిస్తోంది.  నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే డిజైన్ కు అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో  పార్ట్‌ 2పై ఆసక్తి నెలకొంది.  అయితే సినిమా రేట్లు ఎక్కువని చాలా మంది ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గమనించిన నిర్మాణ సంస్ద రేట్లు తగ్గిస్తూ ప్రకటన చేసింది. 

36
kalki 2898 ad

 
రిలీజ్ సమయంలో  పెంచిన రేట్లును ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తగ్గించింది.   కేవలం రూ. 100కే తమ సినిమాని చూడొచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ నెల 2 నుంచి 9 వరకు ఈ ఆఫర్‌ వర్తించనున్నట్టు తెలిపింది. అయితే కండీషన్స్ వర్తిస్తాయని పేర్కొంది.

46


ఈ ఏడాదిలో రూ. 1100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రమిదే.  రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్‌ తెలుగు మూవీగా, 8వ భారతీయ సినిమాగా నిలిచింది. నేపాల్‌లో అత్యధిక వసూళ్లు (రూ. 23 కోట్లకుపైగా) సాధించిన తెలుగు సినిమా ఇదే.  నార్త్‌ అమెరికాలోనూ ‘కల్కి’ చరిత్ర సృష్టిస్తోంది. అప్పటి వరకూ ఉన్న షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ రికార్డును బద్దులు కొట్టింది (18.5మిలియన్‌ డాలర్లు). 

56

 ఓవర్ సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... విడుదలకు ముందు నుంచే నార్త్‌ అమెరికాలో హవా కొనసాగిస్తోంది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). తాజాగా అక్కడ కలెక్షన్ల విషయంలో మరో మైలురాయిని దాటింది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీకి ఓవర్సీస్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. అక్కడ ఈ చిత్రం షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ కలెక్షన్స్‌ను దాటేసింది. ఇప్పటి వరకు 18.5మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసి నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది.  

66


మరోవైపు కల్కి చిత్ర టీమ్ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది అభిమానుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇటీవల అమితాబ్‌ తన బ్లాగ్‌లో పోస్ట్ పెడుతూ.. ‘‘కల్కి’ టీమ్‌ కొంతమందితో ఒక షో ప్లాన్‌ చేస్తోంది. దానికోసం ఇప్పటికే వర్క్‌ మొదలైంది. నేనూ పని చేస్తున్నాను. దయచేసి ఈ పోస్ట్‌ను ఆహ్వానంగా భావించొద్దు. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. ఇది ఫలించొచ్చు.. విఫలమవ్వచ్చు’ అని రాసుకొచ్చారు. దీంతో ‘కల్కి’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుందా అని అభిమానులు అనుకుంటున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories